Breaking News: గుండెపోటుతో అకాలమరణం పొందారు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి…!
Breaking News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి(50) గుండెపోటు వచ్చింది. వెంటనే సహచరులు, బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడికి పల్స్ దొరకడం కష్టంగా ఉందని.. ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇది వెల్లడించిన కొద్ది సమయం తర్వాతనే అతడు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. అతడి మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక అతడి మరణ వార్త విన్న వైసీపీ కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు తరలి వస్తున్నారు.
మంత్రి మరణం పట్ల సీఎం జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థించారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోకవర్గం నుంచి అతడు 2019లో ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి పదవి పొందాడు. ఐటీకి ఏపీ చిరునామా అనేలా బ్రాండింగ్ అవసరమని, ఐటీ బ్రాండింగ్‌పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పరితపించేవారని మంత్రి గౌతమ్ రెడ్డి పరితపించేవారు. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఇటీవల మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పాడు. ఐటీ ఉద్యోగార్థులకు నైపుణ్య శిక్షణ అవసరం అని దానికి తగ్గట్లు ఏర్పాట్లు ప్రభుత్వం కల్పిస్తుందని ఎన్నో సార్లు తెలిపాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…