Rashmika: వామ్మో… పాతికేళ్లకే రష్మిక ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించిందా… రష్మిక ఆస్తి ఎంతో తెలుసా?
Rashmika: ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతరం గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు భీష్మ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో దూసుకుపోతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక ఏకంగా పాన్ ఇండియా స్థాయి హీరోయిన్ గా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.
ఇలా తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా రెండు బాలీవుడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రస్తుతం షూటింగ్లతో బిజీగా ఉన్నారు.బాలీవుడ్ చిత్రాలకు ఈమె దాదాపు నాలుగు కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.ఇక పాతిక సంవత్సరాల వయస్సు గల రష్మిక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
ఇంత చిన్న వయసులోనే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ భారీ మొత్తంలోనే ఆస్తి పోగు చేసినట్లు తెలుస్తుంది ఇప్పటికే ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాలలో ఎంతో విలువైన ఇంటిని కొనుగోలు చేసినట్లు మనకు తెలిసిన విషయమే.
ఈ క్రమంలోనే రష్మిక ఇప్పటివరకు సుమారు 35 కోట్ల రూపాయల ఆస్తిని చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఏడాదికి 10 కోట్ల వరకు ఈమె సంపాదన ఉంటుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మరోవైపు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఏది ఏమైనా పాతికేళ్ళ వయసులోనే ఈమె ఈ స్థాయిలో సంపాదించడం విశేషం. రష్మిక నటించిన ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమా మార్చి నాలుగో తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…