నిరుద్యోగులకు శుభవార్త.. ఇన్ఫోసిస్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..?

ప్రముఖ ఐటీ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 2020 – 21 డిప్లొమా పాసైన విద్యార్థుల కోసం ఇన్ఫోసిస్ ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తోంది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. apssdc వెబ్ సైట్ https://www.apssdc.in/ లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

ఇన్ఫోసిస్ సంస్థ రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అభ్యర్థులను భర్తీ చేస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ నెల 21వ తేదీ లోపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ చేసి షార్ట్ లిస్టింగ్ లో ఎంపికైన అభ్యర్థులకు వచ్చే నెల 9 నుంచి 13 వరకు ఆన్ లైన్ పరీక్షను నిర్వహిస్తారు.

apssdc ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ తీసుకున్నవాళ్లు సులభంగా ఆన్ లైన్ పరీక్షలో పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఈఈఈ బ్రాంచ్ లలో డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, డిప్లొమాలో 60 శాతం మార్కులతో పాసై, బ్యాక్ లాగ్స్ లేని వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు.

ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి 2.2 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో న్యూమరికల్ పజిల్ ఎబిలిటీ, రీజనింగ్, టెక్నికల్, ఇతర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. భవిష్యత్తులో వేతనం పెరిగే అవకాశం ఉండటంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే డిప్లొమా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.