Political News

Nara Lokesh : మహిళలు నిరసన తెలుపుతుంటే ‘సంకరజాతి’ అంటారా? నారా లోకేష్ ఆగ్రహం !

Nara Lokesh : వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌పై చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. “మమ్మల్ని అవమానించిన వారి ఫోటోల ముందు మహిళలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, వారిని ‘సంకరజాతి’ అని వైసీపీ నాయకులు ఎలా అంటారు? ఇది ఎంత దారుణం!” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏమిటీ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన?” అంటూ వైసీపీ నేతల తీరును దుయ్యబట్టారు.

మహిళల పట్ల వైసీపీ నాయకులు, సాక్షి మీడియాకు చెందిన కొందరు జర్నలిస్టులు వ్యవహరిస్తున్న తీరును లోకేష్ తీవ్రంగా తప్పుపట్టారు. “సాక్షిలో తలపండిన జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఏకంగా సంకరజాతి అంటున్నారు. మహిళలంటే ఎందుకంత చులకన?” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ రెడ్డి తన తల్లిని, చెల్లిని ఇంట్లోంచి వెళ్లగొట్టిన అమానవీయ ఘటనను వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నారేమో అని లోకేష్ విమర్శించారు. మహిళల జోలికి వస్తే, వారి ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. “ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అలా నిరసన తెలిపే వారిని కించపరిచేలా మాట్లాడటం ఎంత మాత్రం సహించం” అని ఆయన స్పష్టం చేశారు. సజ్జల చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇటీవల సాక్షి టీవీలో కృష్ణంరాజు అనే జర్నలిస్టు “అమరావతి వేశ్యల రాజధాని” అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ కేసులో సాక్షి టీవీ ప్రజెంటర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

telugudesk

Recent Posts

Srimalika : బొల్లినేని చేతుల మీదుగా శైలజాకిరణ్‌కు పురాణపండ శ్రీమాలిక!

అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…

23 hours ago

ఆల్‌టైం కనిష్టానికి రూపాయి… జనవరి నుంచి నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ ధరల పెరుగుదల తప్పదా?

భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…

3 weeks ago

చలికాలంలో ‘షాక్’ కొడుతోందా? వస్తువులను తాకితే కరెంట్ తగిలినట్లు ఎందుకు అనిపిస్తుంది?

చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…

3 weeks ago

యోగాకు ఏ సమయం ‘బెస్ట్’? ఉదయమా? సాయంత్రమా? నిపుణులు ఏమంటున్నారు?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…

3 weeks ago

చేపలతో ఇవి కలిపి తింటే ప్రమాదమే! ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…

3 weeks ago

మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉపాధి హామీ చట్టానికి ముగింపు? కొత్త చట్టానికి సిద్ధం

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

3 weeks ago