Nara Lokesh : వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌పై చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. “మమ్మల్ని అవమానించిన వారి ఫోటోల ముందు మహిళలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, వారిని ‘సంకరజాతి’ అని వైసీపీ నాయకులు ఎలా అంటారు? ఇది ఎంత దారుణం!” అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏమిటీ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన?” అంటూ వైసీపీ నేతల తీరును దుయ్యబట్టారు.

మహిళల పట్ల వైసీపీ నాయకులు, సాక్షి మీడియాకు చెందిన కొందరు జర్నలిస్టులు వ్యవహరిస్తున్న తీరును లోకేష్ తీవ్రంగా తప్పుపట్టారు. “సాక్షిలో తలపండిన జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసీపీ నేతలు ఏకంగా సంకరజాతి అంటున్నారు. మహిళలంటే ఎందుకంత చులకన?” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ రెడ్డి తన తల్లిని, చెల్లిని ఇంట్లోంచి వెళ్లగొట్టిన అమానవీయ ఘటనను వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నారేమో అని లోకేష్ విమర్శించారు. మహిళల జోలికి వస్తే, వారి ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. “ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అలా నిరసన తెలిపే వారిని కించపరిచేలా మాట్లాడటం ఎంత మాత్రం సహించం” అని ఆయన స్పష్టం చేశారు. సజ్జల చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను లోకేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇటీవల సాక్షి టీవీలో కృష్ణంరాజు అనే జర్నలిస్టు “అమరావతి వేశ్యల రాజధాని” అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ కేసులో సాక్షి టీవీ ప్రజెంటర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
#YCPinsultsWomen
— Lokesh Nara (@naralokesh) June 9, 2025
తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? ఏమిటీ ఈ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసిపి నేతలు మహిళల్ని… pic.twitter.com/sY0uvkq0Bu



































