Allu Arjun: నువ్వేం హీరో అంటూ…. అల్లుఅర్జున్ పై బాలీవుడ్ సీనియర్ హీరో షాకింగ్ కామెంట్స్!
Allu Arjun:క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ పుష్ప అనే పాన్ ఇండియా చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అనుకున్న దానికన్నా ఎక్కువగా కలెక్షన్లను వసూలు చేయడమే కాకుండా అత్యధిక రికార్డులను నెలకొల్పింది.ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప సినిమాకు అందులో నటించిన అల్లు అర్జున్ కి విపరీతమైన క్రేజ్ పెరిగిందని చెప్పాలి.
ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రెటీలు పుష్ప సినిమా అల్లు అర్జున్ నటన పై ప్రశంసలు కురిపించారు. థియేటర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను రెట్టింపు సందడి చేస్తోందని చెప్పాలి.ఇప్పటికే ఈ సినిమా 350 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా గురించి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, జాన్వీ కపూర్, అలియా వంటి తదితరులు అల్లు అర్జున్ పై అతని నటన పై ప్రశంసలు కురిపిస్తూ ఆయనకు అభిమానులుగా మారిపోయారు.ఈ క్రమంలోనే మరొక బాలీవుడ్ సీనియర్ హీరో సైతం అల్లు అర్జున్ నటనకు ఫిదా అయ్యానని ఈ సందర్భంగా తెలియజేశారు.
బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ నటన పై ప్రశంసలు కురిపించారు. తాజాగా పుష్ప సినిమా చూశాను అల్లు అర్జున్ నువ్వేం హీరో వయ్యా….అదేమి నటన చాలా అద్భుతంగా చేశావు నేను కూడా నీ నటనకు అభిమానిగా మారిపోయాను అంటూ అతని నటనపై ప్రశంసలు కురిపించారు. పుష్ప సినిమా చూస్తున్నంతసేపు 1990లలో నేను నటించిన సినిమాలే గుర్తుకొస్తున్నాయి అంటూ మాట్లాడారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మిథున్ చక్రవర్తి కూడా బెస్ట్ సెల్లర్ వెబ్ సిరీస్‌తో డిజిటల్ మీడియాలోకి అడుగుపెడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో మిథున్ చక్రవర్తి ఒక కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…