Priyamani: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ప్రియమణి కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రియమణి తాజాగా నటించిన భామా కలాపం 11వ తేదీ ఆహాలో విడుదలైంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ఎంతో మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అభిమన్యు దర్శకత్వంలో సుదీర్, బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ప్రియమణి అనుపమ పాత్రలు ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో ఈమె నిత్యం పక్కింటిలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలని ఆత్రుత గల వ్యక్తిగా నటించారు.
ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రియమణి మాట్లాడుతూ ఈ రోజు ఉదయమే మా ఆయన ఈ సినిమా చూశారు చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉందని ప్రతి ఒక్కరి పాత్ర చాలా బాగుందని చెప్పినట్లు ప్రియమణి ఈ వేదికపై మాట్లాడారు. ఇకపోతే అనుపమ(ప్రియమణి), శిల్ప కాంబినేషన్ చాలా బాగుందని, నిజం చెప్పాలంటే నా భర్త కంటే తనతోనే నా రిలేషన్ బాగుందని.. నా భర్త కూడా మా ఇద్దరి కెమిస్ట్రీ గురించి అదే మాట్లాడారని ఈ సందర్భంగా ప్రియమణి తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…