బుల్లితెరపై ఎంతో అద్భుతమైన రేటింగ్స్ తో దూసుకుపోతున్న బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ రియాలిటీ షో వివిధ భాషలలో ప్రసారం అవుతూ ఎంతో ఆదరణ పొందింది. ఈ క్రమంలోనే తెలుగులో నాలుగు సీజన్లను ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఐదవ సీజన్ ప్రసారం కావాల్సి ఉండగా కరోనా కారణం చేత వాయిదా పడింది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రసారం చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సీజన్ ఫైవ్ లో పాల్గొనే కంటెస్టెంట్ లను జూమ్ కాల్స్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.తెలుగులో ఇప్పటివరకు నాలుగు సీజన్లలో ఎంతో విజయవంతంతో పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమానికి ముగ్గురు స్టార్ హీరోలు హోస్ట్ గా వ్యవహరించారు.
బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్టీఆర్, రెండవ సీజన్ నాని, మూడు నాలుగు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఐదవ సీజన్ హోస్ట్ ఎవరనే విషయంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది నాగార్జున పలు సినిమాల కారణంగా బిజీగా ఉండటం చేత ఈ సారి రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేయడం కోసం “బిగ్ బాస్ బజ్”అనే టాక్ షో రెండు సంవత్సరాల క్రితం మొదలైంది. ఈ క్రమంలోనే మూడవ సీజన్ కి తనిష్ యాంకర్ గా వ్యవహరించారు. నాలుగవ సీజన్ కి రాహుల్ యాంకర్ గా వ్యవహరించారు. ఇక తాజాగా ప్రసారం కాబోయే ఐదవ సీజన్ కు యాంకర్ గా సోహైల్ వ్యవహరించాల్సి ఉంది. అయితే సోహైల్ కు పలు కారణాల వల్ల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ అవకాశాన్ని వదులుగా ఉన్నట్లు తెలుస్తోంది. సోహెల్ తప్పుకోవడంతో బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి యాంకర్ గా బిగ్ బాస్, బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందని విషయం తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…