Artist Pramila Rani : విజయరాణికి 15 లక్షలు ఇస్తే తీసుకుని బెంగళూరుకి పారిపోయింది… పేకాట ఆడి కొంత డబ్బు పోగొట్టుకున్నాను…: నటి ప్రమీల రాణి

0
154

Artist Pramila Rani : దాదాపు 85 కు పైగా సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి మంచి పేరు, గుర్తింపు అందుకున్న నటి ప్రమీల గారు. బాహుబలి బామ్మ గా మంచి గుర్తింపు అందుకున్న ప్రమీల గారు మొదట వద్దు బావ తప్పు, రియల్ పోలీస్, ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్టు గోదావరి మొగుడు, వేదం, బాహుబలి, విక్రమార్కుడు, చలో లాంటి చాలా సినిమాల్లో నటించారు. అయితే ఎక్కువగా వేదం, బాహుబలి సినిమాల్లో గుర్తింపు అందుకున్న ఆమె తాజగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు.

నా డబ్బు తీసుకుని పారిపోయింది…

నాటక రంగం నుండి వచ్చిన ప్రమీల గారికి అదే నాటకారంగం నుండి వచ్చిన విజయరాణి గారు బాగా పరిచయం, మొదటి నుండి ఇద్దరికీ మంచి అనుబంధం ఉండటం వల్ల ఆమె అడిగితే అప్పుగా 15 లక్షలు ఇచ్చారట ప్రమీల. అయితే ఆమె డబ్బు తీసుకుని బెంగళూరుకి పారిపోయిందట. కొడుకుని సినిమాల్లో ఆర్టిస్ట్ ను చేయాలని ఎవరో చెబితే మోసపోయి డబ్బు పోగొట్టుకుంది.

మళ్ళీ హైదరాబాద్ కి పోలీసులు తీసుకువస్తే నన్ను పిలిపించారు. డబ్బు ఇప్పటికీ పూర్తిగా తిరిగి ఇవ్వలేదు. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఇచ్చింది తీసుకున్నాను. మనకు ప్రాప్తం ఉంటే మనకు దక్కుతుందని నా నమ్మకం అంటూ ప్రమీల తెలిపారు. విజయ రాణి చాలా మంచిది కానీ కొడుకు భవిష్యత్ కోసం ఆశపడి అలా చేసి మోసపోయింది అంటూ చెప్పారు.