Artist Pramodini : కృష్ణ గాడి వీర ప్రేమగాధ, లై, ఆక్సిజన్ వంటి సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో గుర్తింపు అందుకున్న నటి ప్రమోదిని. కర్ణాటక కు చెందిన ప్రమోదిని తెలుగు, కన్నడ, తమిళం ఇలా పలు భాషలలో సినిమాలలో నటిస్తున్నారు. ‘హ్యాష్ ట్యాగ్ బ్రో’ సినిమాతో మరింత గుర్తింపు అందుకున్న ప్రమోదిని గారు తాజాగా శ్రీ విష్ణు సినిమా ‘సామజవరగమన’ సినిమాలో నటించి మంచి హాస్యాన్ని పండించారు. ఆమె కెరీర్ గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

శ్రీలక్ష్మి గారితో మంచి అనుబంధం ఉంది…
కమెడియన్ అలాగే సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన శ్రీలక్ష్మి గారంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె సినిమాలో కాకుండా వ్యక్తిగతంగా అంటే చాలా ఇష్టమంటూ ప్రమోదిని తెలిపారు. ఆలా ఆమెతో కలిసి ఏదైనా సినిమాలో పనిచేస్తున్నామంటే బాగా టైం స్పెండ్ చేస్తాం అంటూ చెప్పారు. అలా హ్యాష్ ట్యాగ్ బ్రో సినిమా షూటింగ్ టైం లో కరోనా మొదటి వేవ్ కావడం, అలాగే అరకులో షూటింగ్ దాదాపు పదిహేను రోజులు ఉండగా ఇద్దరి కాంబినేషన్ సన్నివేశాలు ఉన్నాయి మేమిద్దరం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం.

కానీ బయటి ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఆమె తినడం, ఆమెకు ఫుడ్ పాయిజన్ అవడంతో అందరం కంగారు పడ్డాము. ఆ సమయంలో నాకు తెలిసిన డాక్టర్ అమెరికాలో ఉన్న అతనికి ఫోన్ చేసి ఎం చేయాలని అడిగి అప్పటికప్పుడు ఆమెను చూసుకున్నాను. ఇక సామజవరగమన సినిమాలో సీనియర్ నటుడు నరేష్ ను నిజంగానే కొట్టారా అనే ప్రశ్నకు అలాంటిదేమి లేదని ప్రమోదిని తెలిపారు. నరేష్ గారి మీదకు పేపర్ విసిరితే గ్రాఫిక్స్ లో బాటిల్ విసిరినట్లు సినిమాలో చేసారు. నేను కొట్టలేదు అంటూ చెప్పారు.