Featured

పెళ్లి చేసుకుంటే ఫ్రీగా 10 గ్రాముల బంగారం.. ఎక్కడంటే..?

దేశంలో బంగారం ఖరీదు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 50,000 రూపాయలకు పైగా ఉండటంతో సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు బంగారం కొనుగోలు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పెళ్లి చేసుకుంటే 10 గ్రాముల బంగారం ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

అస్సాం సర్కార్ ఈ కొత్త పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. అమ్మాయి పెళ్లికి బహుమతిగా బంగారం ఇవ్వాలనే ఉద్దేశంతో అస్సాం సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేయడానికి సిద్ధమైంది. అరుంధతీ గోల్డ్ స్కీమ్ పేరుతో అస్సాం సర్కార్ అమలు చేస్తున్న ఈ పథకం అక్కడి ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ప్రయోజనం చేకూర్చేలా పలు పథకాలు అమలులో ఉన్నాయి.

అయితే చాలా రాష్ట్రాలు నగదు రూపంలోనే ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నాయి. అయితే అస్సాం సర్కార్ పెళ్లి చేసుకునే అమ్మాయిలకు డబ్బులు ఇవ్వడం కంటే బంగారం ఇవ్వడం వల్లే ప్రయోజనం చేకూరుతుందని భావిస్తోంది.. తల్లిదండ్రులు అమ్మాయి పెళ్లి కోసం ఖచ్చితంగా బంగారం చేయిస్తారు. అందువల్ల ఈ విధంగా అమ్మాయిలకు బంగారం ఉపయోగపడుతుందని.. డబ్బు ఇస్తే ఆ నగదును అవసరాల నిమిత్తం ఖర్చు చేస్తారని భావిస్తోంది.

ఈ పథకానికి అర్హత పొందాలంటే కొన్ని నియమనిబంధనలు అమలులో ఉన్నాయి. అమ్మాయి కుటుంబ వార్షిక ఆదాయం ఖచ్చితంగా 5 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలి. అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు, పెళ్లి చేసుకునే అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలి. ఈ స్కీమ్ అమలు ద్వారా బాల్య వివాహాలను సైతం తగ్గింవచ్చని అస్సాం ప్రభుత్వం భావిస్తుండటం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago