స్టార్ మాలో ప్రసారం అయిన బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ నాలుగు సీజన్ లు విజయవంతంగా పూర్తి చేసుకొని రేపో, మాపో ఐదవ సీజన్ కూడా మొదలు కాబోతోంది. అయితే బిగ్‌బాస్ 4 హౌజ్‌లో క్లోజ్‌గా ఉన్న కంటెస్టెంట్‌లలో అరియానా, అవినాష్ జంట ఒకటి.
హౌజ్‌లోకి వెళ్లిన కొత్తలో వీరిద్దరి మధ్య పెద్దగా ర్యాపో లేనప్పటికీ.. ఆ తరువాత బాగా క్లోజ్ అయ్యారు. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారిద్దరి మధ్య స్నేహం కొనసాగింది. కానీ ఈ మధ్య వారిద్దరు ఎక్కువగా సోషల్ మీడియాలో అయినా.. యూట్యూబ్ లో అయినా అభిమానులతో ముచ్చటించడం మానేశారు. దానికి కారణం ఏంటనేది తాజాగా విడుదలైన ‘కామెడీ స్టార్ ’ షోలో వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రోమో చివరలో అవినాష్, అరియానా ను ప్రశ్నిస్తూ యాంకర్ శ్రీముఖి ప్రశ్నిస్తూ.. మీరెందుకు విడిపోయారంటూ అడిగింది. దానికి అరియానా గ్లోరీ మాట్లాడుతూ.. ఆ గొడవ తర్వాత కూడా గొడవ ఎందుకైందో.. ఎలా జరిగిందో మా ఇద్దరినీ కూర్చొబెట్టి మాట్లాడినా తమకు తెలియదని.. గొడవ తర్వాత మాట్లాడొద్దు అనే ప్రభావం ఎక్కువగా ఇంపాక్ట్ చూపించదన్నారు.
దీనిపై అవినాష్ మాట్లాడుతూ.. స్నేహితుడు తప్పు దోవలో వెళ్తుంటే ఇది రాంగ్ అని చెప్పానని.. వినకపోవడంతో మాట్లాడటం మానేశానని.. అయినా ఆమె వచ్చి సారీ చెప్పి మాట్లాడిందని అన్నారు. పొగరుబోతు ప్రవర్తన కూడా తగ్గించుకోమని చెప్పండి అని అరియానా.. జడ్జిలతో చెప్పింది. దీనికి సమాధానంగా అవినాష్.. మనిషి అన్న తర్వాత కోపాలు, తాపాలు అన్నీ ఉంటాయన్నారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…