Featured

Babu Antony : పసివాడి ప్రాణం సినిమాలో ఒకప్పటి విలన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

Babu Antony : తెలుగు ఇండస్ట్రీలో ఎందరో నటులు, మహానటులు ఉన్నారు. హీరోలుగా చాలామంది మంచి గుర్తింపును లభించుకొన్నప్పటికీ వారికి సమానంగా నటించి విలనిజంలో కొత్త అర్థాన్ని చూపించిన కొంతమంది విలన్స్ చూస్తేనే భయం వేస్తుంది మనకు. అంత క్రూరత్వాన్ని వెండితెరపై చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు, పసివాడి ప్రాణం సినిమా విలన్ గా నటించిన బాబు అంటోనీ. ఈయన చాలా మందికి తెలియక పోవచ్చు కానీ, ఇతను నటించిన పసివాడి ప్రాణం సినిమాలో విలన్ అని చెప్పగానే అబ్బో ఈ విలన్ అని వెంటనే గుర్తుపడతారు తెలుగు వాళ్ళు.

ఇక హీరోలతో సమానంగా ఫైట్ లు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంటోనీ అతని సినిమాలలో ఎక్కువగా డైలాగ్స్ ఉండవు కేవలం యాక్షన్స్ మాత్రమే ఉంటాయి. ముఖ్యంగా ఈయన జేబుదొంగ, శత్రువు, మిత్రుడు, నిప్పురవ్వ, లారీ డ్రైవర్, ఏకలవ్యుడు, కాంచన వంటి సినిమాలలో విలన్ గా నటించి ప్రేక్షకుల ఆదరణను పొందాడు. ఇంకా తినేత్రుడు, పసివాడి ప్రాణం సినిమాలో ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మెగాస్టార్ చిరుతో పోటాపోటీగా ఫైట్ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఆయన.

బాబు అంటోనీ వ్యక్తిగత విషయానికి వస్తే… తను సినిమాల్లో మాత్రమే కాదు తన నిజజీవితంలో కూడా మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సాధించాడు. కేరళ రాష్ట్రానికి చెందిన మలయాళీ ఈయన. ఎటువంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి ఆదరణ తెచ్చుకున్నాడు బాబు అంటోనీ. అప్పటిలో మంచి స్టార్ డం హీరోగా ఎదిగాడు. ఇక ఇతను పూణేలో ఇంగ్లీష్ లిటిరేచర్ గా డిగ్రీ పూర్తి చేశాడు. మొదటిగా విలన్ పాత్రలు శిరంబు అనే సినిమాతో బాబు ఆంటోనీ మళియాల సినిమారంగంలోకి అడుగు పెట్టాడు. అప్పటిలో అగ్ర హీరోలు కూడా ఇతరులతో ఫైట్లు చేయాలంటే చాలా కష్టపడేవారు. ఆంటోనీ తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. దాదాపు 160 సినిమాలలో ఈయన నటించారు.

సినిమాలలో బిజీగా ఉన్న సమయంలోనే ఒక రష్యన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. విలన్ గా తెలుగు ప్రేక్షకులకి బాగా గుర్తుండిపోయే విలన్ గత కొన్ని రోజులుగా మన తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ కనబడలేదు. కానీ తమిళ్, మలయాళం సినిమాలో మాత్రం నటిస్తూ ఉన్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ సినిమాలో నటించాడు. ఇక ఇతడు కేవలం నటుడు మాత్రమే కాదు డైరెక్టర్ కూడా. దర్శకత్వం వహించిన సినిమాలు కూడా ఉన్నాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

16 minutes ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

36 minutes ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

2 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

3 hours ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

3 hours ago

“పాక్ అణు కేంద్రంపై భారత్ దాడి?.. రక్షణ నిపుణుడి వ్యాఖ్యలతో అంతర్జాతీయ కలకలం”

భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…

3 hours ago