C. Kalyan : తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సి కళ్యాణ్, సికే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద పలు సినిమాలను నిర్మించారు. ఫిల్మ్ ఛాంబర్ రాజకీయాల్లోను ఉండే కళ్యాణ్ పూరీ జగన్నాథ్ తో ఎక్కువగా ట్రావెల్ అయ్యారు. మెగా కుటుంబంతో సినిమా చేసిన కళ్యాణ్ ఇటు నందమూరి హీరోలతోను సినిమాలు చేసారు. పూరీ కాంబినేషన్ లో జ్యోతి లక్ష్మి సినిమా తో మొదలు పెట్టి ఆ తరువాత లోఫర్ సినిమా కూడా చేసాడు. ఇక పలు ఇంటర్వ్యూ ల్లో సినిమా ఇండస్ట్రీ గురించి కామెంట్స్ చేసే కళ్యాణ్ మెగా ఫ్యామిలీ కి నందమూరి కుటుంబానికి ఉన్న తేడా గురించి చెప్పారు.
బాలయ్య బాబు ముక్కుసూటి మనిషి….
జ్యోతి లక్ష్మి సినిమాను నిర్మించిన కళ్యాణ్ ఆ తరువాత లోఫర్ సినిమాను మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ తో తీశారు. ఆ తరువాత బాలకృష్ణ తో జై సింహ సినిమాను కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో నిర్మించారు. ఇక వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా ‘ఇంటెలిజెంట్’ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా వల్ల నష్టపోయానంటూ కళ్యాణ్ చెప్పారు. నాగబాబు తో ఉన్న సాన్నిహిత్యం వల్ల వరుణ్ తేజ్ ను నా కొడుకు అన్నట్లు గా భావించాను. తనకు అప్పటి వరకు తీసుకున్న రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువ ఇచ్చాను లోఫర్ సినిమా ప్లాప్ అయి నష్టమోచ్చిన మెగా కుటుంబం నుండి స్పందన లేదు. ఇక వినాయక్ తో ఎప్పటినుండో సినిమా తీయాలనీ అనుకున్నాను. వినాయక్ నాకు చాలా ఆప్తుడు అందుకే ఒక ప్రాజెక్ట్ అనుకున్న అప్పుడు కుదరలేదు మళ్ళీ ‘ఇంటెలిజెంట్’ సినిమాను సాయి ధరమ్ తేజ్ తో వినాయక్ కాంబినేషన్ లో తీసాము వినాయక్ మీద అభిమానం, నమ్మకం తో ఎక్కువ బడ్జెట్ పెట్టాము అయితే బాగా నష్టమొచ్చింది అప్పుడు కూడా మెగా కుటుంబం స్పందించలేదు. ఇక చిరంజీవి గారితో నాకు పెద్ద పరిచయాలు లేవు .
ఇక చరణ్ చాలా మంచి అబ్బాయి అంటూ చెప్పారు కళ్యాణ్. మెగా ఫ్యామిలీ తో విబేధాలు లేవు కానీ ఆ రెండు సినిమాల వల్ల కొంత దూరంగా ఉన్నాను అంటూ చెప్పారు. ఇక బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలకృష్ణ చాలా ముక్కుసూటి మనిషి అంటూ చెప్పారు. ఏదైనా సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన విషయాలు అయన దగ్గరకు తీసుకెళ్లాడానికి చాలా మంది భయపడతారు కానీ నాకు అయన దగ్గర ఆ చనువు ఉంది వెళ్లి ఆయనతో సమస్య చెప్పగలను అలాగే ఏదైనా ఇండస్ట్రీకి సహాయం లేదా ఎవరైనా వ్యక్తులకు సహాయం చేయాలన్న అయన దగ్గరికి వెళితే స్పందిస్తారు. ఇక ఆయనకు నచ్చకపోతే ఖచ్చితంగా అప్పుడే నచ్చలేదని చెప్పేస్తారు చాలా మంచి వ్యక్తి ఆయన వద్ద కి వెళ్లాలంటే భజన చేయాల్సిన పనిలేదు అంటూ చెప్పారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…