Keerthi Suresh: మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం రఘు తాత సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కీర్తి సురేష్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల జరిగిన 69వ సౌత్ ఫిలింఫేర్ అవార్డు కార్యక్రమాలలో భాగంగా కీర్తి సురేష్ దసరా సినిమాకు గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ అవార్డు కార్యక్రమం అనంతరం ఈమె వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా తన నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి వెల్లడించారు. సినీ సెలబ్రిటీలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని నేరుగా తన ఇంట్లోకి వచ్చు తన ముందు నిలబడి తనని పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసినట్లు ఈమె వెల్లడించారు.
ఇలా ఆ వ్యక్తి నేరుగా నాకు ప్రపోజ్ చేయడంతో ఒక్కసారిగా భయం వేసింది కానీ ఆయన నా పట్ల చూపించే అభిమానం చూసి సంతోషం వేసిందని ఇలా సినిమా కోసం మేము పడే ఈ కష్టం మీ అభిమానం ముందు ఏ మాత్రం కష్టం అనిపించదని తెలిపారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడారు మహానటి సినిమా సమయంలోనే తనని మొదటిసారి చూసానని తెలిపారు.
ఎన్టీఆర్ తో నటించాలని ఉంది..
తనకు అవకాశం వస్తే తప్పకుండా ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేస్తానని వెల్లడించారు మా ఇద్దరి జోడి స్క్రీన్ పై చాలా బాగుంటుంది అంటూ ఈమె ఎన్టీఆర్ తో నటించడం గురించి తన మనసులో కోరికను బయటపెట్టారు దీంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. మరి ఈ మహానటి కి ఆ మహానటుడు అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…