Featured

Babu Mohan : బాలకృష్ణ సినిమాలో రెండు గంటల కాల్షీట్ ఇచ్చాను.. నా వల్ల శోభన్ బాబు గారు సాయంత్రం నుండి రాత్రి వరకు షూటింగ్ చేసారు..: బాబు మోహన్

Babu Mohan : మామగారు సినిమాతో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు బాబు మోహన్, అనతి కాలంలోనే మంచి స్టార్ కమెడియన్ గా ఎదిగారు. అప్పట్లో బాబు మోహన్, కోటా శ్రీనివాస్ రావు గారి కాంబినేషన్ అంటే సినిమాకి ప్లస్ అనేంతగా వాళ్ళ కాంబినేషన్ హిట్ అయింది. ఆ తరువాత బ్రహ్మానందం, బాబు మోహన్ కాంబినేషన్ కూడా అంతే క్లిక్ అయింది. ఒకానొక దశలో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిన బాబు మోహన్ గారు అప్పటి పరిస్థితుల గురించి ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు.

బాలకృష్ణ సినిమాల్లో రెండు గంటల కాల్షీట్ ఇచ్చాను…

ఇక బిజీ ఆర్టిస్ట్ గా మారిన బాబు మోహన్ గారికి సినిమాల్లో కచ్చితంగా ఒక సాంగ్స్ కుడా అప్పట్లో ట్రెండ్ అయింది. చాలా సినిమాలకు డేట్లు కూడా సర్దుబాటు చేసే పరిస్థితి లేదు దాంతో కొన్ని వదులుకోవాల్సి వచ్చేది. అలాంటి సమయంలో కొంతమంది దర్శకులు రోజుకి అర్ధగంట అయిన చాలు వచ్చి వెళ్ళు అంటూ చెప్పేవారట. అలా బాలకృష్ణ సినిమాకు రెండు గంటలే కాల్షీట్ ఇచ్చిన బ్రహ్మానందం  కాంబినేషన్ లో సన్నివేశాలు బాగా పేలింది సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

ఇక మరో సందర్బంలో శోభన్ బాబు గారు, బాలకృష్ణ గారి సినిమాలో నా కాల్షీట్ కుదరక సాయంత్రం షూటింగ్ చేయవలసి రావడంతో ఎప్పుడు షూటింగ్ ఆరు దాటాక చేయని శోభన్ బాబు గారు నా వల్ల సాయంత్రం నుండి రాత్రి దాకా చేసారు అంటూ అప్పటి జ్ఞాపకాలు చెప్పారు బాబు మోహన్. మళ్ళీ కుదిరితే మా అన్న కోటా గారితో కలిసి కామెడీ సన్నివేశాలు చేయాలని ఉంది అంటూ మనసులోని మాట చెప్పారు.

Bhargavi

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

6 hours ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

6 hours ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

6 hours ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

6 hours ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

6 hours ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

7 hours ago