Parachuri Gopala Krishna : సినీ రచయిత, ప్రముఖ నటుడు పరుచూరి గోపాలకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఎన్నో సినిమాలకు కథా రచయితగా పనిచేసిన గోపాలకృష్ణ కొన్ని సినిమాలలో తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవల ఈయన మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మీద సంచలన కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా దాదాపు 200 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటి లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఈ సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో మోడ్రన్ గా ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే టైటిల్ పెట్టారు. కానీ ఆ రోజుల్లో అయితే దేశద్రోహులు అనే టైటిల్ పెట్టేవాళ్ళు. ఈ సినిమా మొదటి భాగంలో హీరో హీరోయిన్ మధ్య కామెడీ ప్రేక్షకులను బాగా అలరించింది. మొదటి 15 నిమిషాలు ఈ సినిమా చూస్తే సినిమా మొత్తం ఇలాగే సాగిపోతే బాగుంటుందని ప్రేక్షకులు అనుకున్నారు.
మహేష్ బాబు సడన్ గా అమెరికా నుండి ఇండియాకు పయనమవటంతో కథ మొత్తం అస్తవ్యస్తం అయ్యింది. హీరో హీరోయిన్ మధ్య ఉన్న కామెడీ సన్నివేశాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు ఇలా ఒక్కసారిగా యాక్షన్ టర్న్ తీసుకోవడంతో ప్రేక్షకులు బోరింగ్ గా ఫీల్ అయ్యారు. ఈ సినిమాలో రెండవ భాగం లో హీరో, విలన్ మద్య రివెంజ్ ఫైటింగ్ ఎక్కువ ఉండడం ప్రేక్షకులు విసిగిపోయారు.
ఈ సినిమా ఇలా ఉండడం వల్ల కేవలం 200 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అలా కాకుండా ఈ సినిమాలో చిన్న చిన్న మార్పులు చేసి ఉంటే మరొక 100 కోట్లు వసూలు అయ్యేది అంటూ పరుచూరి గోపాలకృష్ణ తనదైన రీతిలో ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా గురించి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…