Alia Bhatt: ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆలియా భట్ ఈ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. ఇటీవల తన ప్రియుడు రణబీర్ కపూర్ ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.
అలియా రణబీర్ పెళ్లి జరిగిన రెండు నెలలకే అలియా భట్ ప్రెగ్నెంట్ అన్న గుడ్ న్యూస్ ని షేర్ చేసింది. దీంతో ఆలియా అభిమానులతో పాటు రణబీర్ కపూర్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆలియా ఇప్పుడు పెళ్లికి ముందు ఒప్పుకున్న సినిమా షూటింగ్ లను పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది. తాజాగా ఈ అమ్మడు హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొనింది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పోర్చ్‌గల్‌లోని ఎడారి ప్రాంతంలో జరిగింది.
ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ జరిగిన సమయంలో కొంతమంది అలియా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలలో అలియా బేబీ బంప్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. పెళ్లికి ముందు కమిట్ అయిన హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా కోసం ఆలియా బేబీ బంప్ తో ఎడారిలో కష్టపడుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫోటోలను ఆలియా కూడా ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.
ఈ ఫోటోలలో ఆలియా తన బేబీ బంప్ కనిపించకుండా బ్లాక్ జాకెట్ నడుముకు కట్టుకుంది. ప్రస్తుతం ఆలియా బేబీ బంప్ తో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు చూస్తున్న ఎంతో మంది నెటిజన్లు బేబీ బంప్ తో ఇలాంటి సాహసాలు అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అలియా భట్ రణబీర్ కపూర్ కలిసి జంటగా బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా కూడా తొందర్లోనే విడుదల కానున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…