టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో వందల సినిమాల్లో కమెడియన్ గా నటించి ఎంతో మందిని నవ్వించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటులలో కమెడియన్ బాబు మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాబు మోహన్ ఉన్నాడంటే ప్రేక్షకులకు నవ్వులే నవ్వులు. ఎన్నో సినిమాలలో అద్భుతమైన నటన ద్వారా ప్రేక్షకులను మెప్పించిన బాబు మోహన్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ తన రాజకీయ ప్రవేశం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇంటర్వ్యూలో భాగంగా తన కొడుకును గుర్తుచేసుకుని భావోద్వేగం అయ్యారు. కోట శ్రీనివాస రావు బాబు మోహన్ కలిసి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.దురదృష్టవశాత్తు మా ఇద్దరి కొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణించి మా ఇద్దరికీ తీరని కడుపుకోత మిగిల్చారని బాబు మోహన్ ఈ సందర్భంగా తన కొడుకుని గుర్తు చేసుకున్నారు.
ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాబుమోహన్ మెగాస్టార్ చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి ఒక మగాడు, ఆయన ఒక రబ్బరు. ఎటు కావాలంటే తన శరీరాన్ని అటు తిప్పుతూ అద్భుతంగా డాన్స్ కు చేస్తారు. చిరంజీవి గారి సినిమా అంటే హీరోయిన్లు వణికిపోయే వారు. ఆయనతో కలిసి డాన్స్ చేయాలంటే హీరోయిన్లు కూడా ఆలోచించే వారిని తెలిపారు.
ఇక చిరంజీవికి పోటీగా రాధ, విజయశాంతి, రాధిక వంటి హీరోయిన్లు పోటీపడి మరీ చేసేవారని ఆయన టీవీలో కనబడి డాన్స్ చేస్తే నా కళ్ళు ఆకాశమంత చేసి చూసేవాన్ని ఈ సందర్భంగా చిరంజీవి గారి డాన్స్ గురించి పొగుడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…