జబర్దస్త్ ద్వారా అందరికీ పరిచయమైన కమెడియన్ ముక్కు అవినాష్ పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. తన సామాజిక వర్గానికి చెందిన అనూజ అనే అమ్మాయిని, పెద్దలు కుదిర్చిన వివాహాన్ని అవినాష్ చేసుకున్నారు. గత రెండు రోజుల నుంచి అవినాష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. హల్ది మంగళ స్నానం వేడుకలలో పలువురు కమెడియన్స్ పాల్గొని సందడి చేశారు.
ఈ క్రమంలోనే నేడు అవినాష్ అనూజ మెడలో మూడుముళ్లు వేసి తనతో ఏడడుగులు నడిచారు. ఈ క్రమంలోనే అవినాష్ వివాహానికి ఇటు బుల్లితెర,అటు వెండితెర సెలబ్రిటీలు హాజరై ఎంతో సందడి చేశారు. ముఖ్యంగా బిగ్ బాస్ లోఅవినాష్ పాల్గొనడంతో బిగ్ బాస్ సెలబ్రిటీలు కూడా అవినాష్ వివాహానికి హాజరయ్యారు.
భానుశ్రీ, రోల్ రైడా అవినాష్ వివాహానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే అవినాష్ పెళ్లిలో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ముక్కు అవినాష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రస్తుతం ముక్కు అవినాష్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ముక్కు అవినాష్ స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.ఈ కార్యక్రమంతో పాటు పలు కార్యక్రమాలలో అవినాష్ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…