Movie News

నా గురించి మా అమ్మ అప్పుడే చెప్పింది.. కానీ నేనే అమ్మ మాట వినలేదు: సమంత

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత 2017వ సంవత్సరంలో అక్కినేని నాగ చైతన్య వివాహం చేసుకుని తెలుగింటి కోడలిగా అడుగుపెట్టింది. ఇలా వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా వీరుకొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకోబోతున్నట్లు అక్టోబర్ 2వ తేదీన అధికారికంగా ప్రకటించారు. ఇలా ఒక్కసారిగా వారి విడాకుల విషయాన్ని చెప్పడంతో అభిమానులు ఎంతో షాక్ అయ్యారు.

ఇక విడాకులు ప్రకటన అనంతరం సమంత తన జ్ఞాపకాలను మర్చిపోవడానికి ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతున్నారు. అదేవిధంగా విడాకుల ప్రకటన తర్వాత సమంత మొట్టమొదటిసారిగా బుల్లితెరపై ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమానికి హోస్ట్ గా వచ్చారు. దసరా పండుగ రోజు ప్రసారమైన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సమంత మధ్య ఎన్నో సరదా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 25 లక్షల ప్రశ్నగా సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన శశిథరూర్‌ ‘యాస్‌ ఎరా ఆఫ్‌ డార్క్‌నెస్‌’ అనే పుస్తకం దేని గురించి రాయబడింది అని ఎన్టీఆర్ అడగగా అందుకు సమంత బ్రిటిష్ పరిపాలన గురించి అంటూ సరైన సమాధానాన్ని చెప్పి 25 లక్షల గెలుచుకుంది.ఇలా ఇరవై ఐదు లక్షలు గెలుచుకోవడంతో ఎన్టీఆర్ జీనియస్ అని అనగానే సమంత నేను జీనియస్ అని మా అమ్మ ఎప్పుడో చెప్పింది. కానీ నేనెప్పుడూ ఆ మాటను వినలేదు అంటూ సమంత ఈ సందర్భంగా తెలియజేశారు.

ఇలా ఎన్టీఆర్ కార్యక్రమంలో ఎంతో సరదాగా పాడిన సమంత 25లక్షలను గెలుచుకుంది. ఇలా ఈ కార్యక్రమంలో గెలుచుకున్న డబ్బులు మొత్తం ప్రత్యూష ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.విడాకుల తర్వాత సమంత రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇవ్వడానికి ఈమె సిద్ధమైనట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago