టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత 2017వ సంవత్సరంలో అక్కినేని నాగ చైతన్య వివాహం చేసుకుని తెలుగింటి కోడలిగా అడుగుపెట్టింది. ఇలా వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా వీరుకొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకోబోతున్నట్లు అక్టోబర్ 2వ తేదీన అధికారికంగా ప్రకటించారు. ఇలా ఒక్కసారిగా వారి విడాకుల విషయాన్ని చెప్పడంతో అభిమానులు ఎంతో షాక్ అయ్యారు.

ఇక విడాకులు ప్రకటన అనంతరం సమంత తన జ్ఞాపకాలను మర్చిపోవడానికి ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతున్నారు. అదేవిధంగా విడాకుల ప్రకటన తర్వాత సమంత మొట్టమొదటిసారిగా బుల్లితెరపై ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమానికి హోస్ట్ గా వచ్చారు. దసరా పండుగ రోజు ప్రసారమైన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సమంత మధ్య ఎన్నో సరదా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 25 లక్షల ప్రశ్నగా సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన శశిథరూర్ ‘యాస్ ఎరా ఆఫ్ డార్క్‌నెస్’ అనే పుస్తకం దేని గురించి రాయబడింది అని ఎన్టీఆర్ అడగగా అందుకు సమంత బ్రిటిష్ పరిపాలన గురించి అంటూ సరైన సమాధానాన్ని చెప్పి 25 లక్షల గెలుచుకుంది.ఇలా ఇరవై ఐదు లక్షలు గెలుచుకోవడంతో ఎన్టీఆర్ జీనియస్ అని అనగానే సమంత నేను జీనియస్ అని మా అమ్మ ఎప్పుడో చెప్పింది. కానీ నేనెప్పుడూ ఆ మాటను వినలేదు అంటూ సమంత ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇలా ఎన్టీఆర్ కార్యక్రమంలో ఎంతో సరదాగా పాడిన సమంత 25లక్షలను గెలుచుకుంది. ఇలా ఈ కార్యక్రమంలో గెలుచుకున్న డబ్బులు మొత్తం ప్రత్యూష ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.విడాకుల తర్వాత సమంత రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇవ్వడానికి ఈమె సిద్ధమైనట్లు తెలుస్తోంది.































