Baby Cinema Director Sai Rajesh : బేబీ సినిమా నిడివి దాదాపు ఐదు గంటలు వచ్చింది… ఎస్కేఎన్, మారుతీ ఇద్దరు గిఫ్ట్స్ ఇస్తూనే ఉన్నారు…: బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్

0
24

Baby Cinema Director Sai Rajesh : హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, కలర్ ఫోటో వంటి మూడు సినిమాల తరువాత నాలుగో సినిమాగా బేబీ సినిమాను రూపొందించిన సాయి రాజేష్ బేబీ సినిమాకు కూడా విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. సినిమాలో కథను చక్కగా చూపుతూ నటినటుల నుండి నటన రాబట్టడంలో సక్సెస్ అయినా రాజేష్ బేబీ సినిమా విశేషాలను అలాగే తన మీద ప్రశంసల గురించి ఇంటర్వ్యూ లో పంచుకున్నారు సాయి రాజేష్.

సినిమా హిట్ అవ్వక ముందే గిఫ్ట్స్ వచ్చాయి…

బేబీ సినిమా లో హీరో హీరోయిన్స్ పెద్దగా స్టార్ క్యాస్టింగ్ లేకున్నా సినిమా కథ జనాలను థియేటర్ కు రప్పిస్తోంది. చిన్న సినిమాగా వచ్చి ఇపుడు ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక సినిమా షూటింగ్ సమయంలోని విశేషాలను సాయి రాజేష్ చెబుతూ సినిమా మొత్తం తీసింది అంత ప్లే చేస్తే ఐదు గంటల నిడివి గల సినిమా వస్తుంది. అయినా నిర్మాత ఎస్కేఎన్ ఒక్కమాట అనలేదు. ఇక సినిమా ఎడిట్ చేసి కొన్ని సీన్స్ తీసాక నాలుగు గంటల పైగా వచ్చింది. ఇక ఎడిట్ చేసి కొన్ని సీన్స్ తీసేసి చూస్తే రెండు గంటల 56 నిమిషాల దాకా సుమారుగా సినిమా వచ్చింది.

నా గత సినిమాలన్నీ రెండు గంటల 20 నిమిషాలకు మాత్రమే ఉండేవి ఈ సినిమా ఇంత ఎక్కువ టైం వచ్చేసరికి అప్పటికే కొనాలని వచ్చిన నైజాం డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కి వెళ్లిపోయారు. కానీ మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం సినిమా విషయంలో ఎలాంటి నెగెటివిటీ పట్టించుకోలేదు. అప్పటికే నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ రావడం వల్ల సినిమా ఏమవుతుముందో అనే టెన్షన్ లేదు అయితే సినిమా ఇంకా హిట్ అని తెలియక ముందే నిర్మాత ఎస్కెఎన్ గారు బ్రాండెడ్ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక సినిమా హిట్ అయ్యాక మారుతీ గారు బ్రాండెడ్ షూస్ తీసిచ్చారు. చిరంజీవి గారు కూడ గిఫ్ట్ ఇచ్చారు. అలా నిర్మాత ఎస్కేఎన్ మారుతీ గారు ఇప్ప్పటికి గిఫ్ట్స్ ఇస్తూనే ఉన్నారు. ఒక చిన్నపిల్లాడిని గారాభం చేసినట్లు చేస్తున్నారు అంటూ సాయి రాజేష్ తెలిపారు.