Baby film producer SKN : బేబీ సినిమా కోసం ఇల్లు అమ్మేశా… వైష్ణవి కి ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంతంటే… ఆ విషయం ప్రూవ్ చేస్తే కోటి రూపాయలు ఇస్తాను…: బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్

0
300

Baby film producer SKN : చిన్న సినిమాగా విడుదల అయి మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సినిమా బేబీ. సాయి రాజేష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా యూత్ కి నచ్చుతుంది అనుకుంటే పెద్ద వాళ్లకు కూడా నచ్చి కుటుంబాలతో సినిమాలకు వెళ్తున్నారంటూ సినిమాకి సంబంధించిన విశేషాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఆ సినిమా నిర్మాత ఎస్కేఎన్. నిర్మాతగా ‘టాక్సీ వాలా’ వంటి విజయవంతమైన సినిమాను నిర్మించిన ఎస్కేఎన్ సాయి రాజేష్ తో ఉన్న ఇరవై ఏళ్ల అనుబంధం వల్ల తన మీద ఉన్న నమ్మకంతోనే సినిమా తీసానంటూ చెప్పారు.

మెగాస్టార్ అభిమాని… ఆయన కోసమే ఇండస్ట్రీకి…

చిన్నతనంలో పెద్దయ్యాక ఏమవుతావని ఎవరైనా అడిగితే చిరంజీవి దగ్గరికి పోతా అని చెప్పేవాడని, మెగాస్టార్ అంటే అంత ఇష్టమంటూ ఎస్కేఎన్ తెలిపారు. ఇక ఒక వెబ్ సైట్ పెట్టి అలా అల్లు శిరీశ్ కి పరిచయమైన ఎస్కేఎన్ అలా మెగా కుటుంబానికి దగ్గరయ్యాడట. ప్రస్తుతం తనకు ఎలాంటి వెబ్ సైట్ లేదని, నేను మెగా అభిమానిని అవడం వల్ల ఆయనంటే ఇష్టం ఉంది అందుకని ఇతర హీరోల గురించి బ్యాడ్ గా రాయలేదు. అలా ఇపుడు ఈబ్ సైట్ లో ఆర్టికల్స్ రాస్తున్నాను అని నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తాను అంటూ చెప్పారు. ఇక టాక్సీవాలా సినిమా టైంలో కూడా చిరంజీవి గారు సినిమా చూసి రెండు గంటల పాటు సినిమా గురించి మాట్లాడారంటూ చెప్పిన ఆయన బేబీ సినిమా అపుడు కూడా నేను చూడమని మెసేజ్ చేయగానే ఆల్రడీ చూసాను మాట్లాడాలి ఒకసారి రా అని పిలిచి సినిమాలో అంతర్లీనంగా మంచి మెసేజ్ ఉంది అని అభినందించారట.

ఇక బేబీ సినిమా గురించి మాట్లాడుతూ సినిమా అనుకున్న బడ్జెట్ దాటిపోయే సరికి టెన్షన్ పడ్డాము, వైష్ణవి కి ఈ సినిమాకు ఇచ్చిన రెమ్యూనరేషన్ చాలా తక్కువ అంటూ సినిమా యూనిట్ అంతా బడ్జెట్ గురించి ఆలోచించేవాళ్ళు అంటూ చెప్పారు. మారుతీ గారు సినిమా నిర్మాతల్లో ఒకరని అయితే ఆయనని ప్రతిసారి డబ్బు అడగలేను అందుకే ఇల్లు అమ్మి మరీ సినిమా కోసం పెట్టాను. రాజేష్ చెప్పిన కథను అంత నమ్మాను అంటూ ఎస్కేఎన్ చెప్పారు.