Featured

Balagam director Venu : దిల్ రాజుకి 3 గంటలు కథ చెప్పా… బలగం సినిమాకి నటుల ఎంపిక కోసం 6 నెలలు గడువు తీసుకున్నాను…: బలగం డైరెక్టర్ వేణు

Balagam director Venu : కమెడియన్ గా సినిమాల్లో ప్రయాణం మొదలు పెట్టి నేడు తెలుగు ప్రేక్షకుల మనసు హత్తుకునేలా సినిమా తీసిన డైరెక్టర్ వేణు. కమెడియన్ వేణు నుండి డైరెక్టర్ వేణు గారు వరకు తన ప్రయాణం, తాను పడిన కష్టాలు, ఇబ్బందులు, త్యాగాలు అన్నింటినీ ‘బలగం’ సినిమా సక్సెస్ అయ్యాక అందరి ప్రశంసలతో మర్చిపోతున్నానంటూ ఇంటర్వ్యూలలో చెప్పిన వేణు యెల్దండి తన బలగం సినిమా ప్రయాణం గురించి ఇంటర్వ్యూలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాను ఎలా ఆదరిస్తున్నారు, తనకు వస్తున్న వేలాది రివ్యూల గురించి ఇంటర్వ్యూలో తెలిపారు వేణు. అలాగే తన బలగం సినిమా ప్రయాణం మొదటి అడుగు నుండి ఎలా పడిందో ఇంటర్వ్యూలో వివరించారు.

ఆర్టిస్టులను ఆరు నెలలు ఎంపిక చేశా…

సినిమాలో అందరి సహజమైన నటన ముఖ్యంగా ప్రేక్షకులను ఆకర్షస్తోంది. నిజానికి పేరున్న నటీనటులు కొద్ది మందే ఉన్నా అందరూ కొత్తవాళ్ళే అయినా కూడా అందరి నటన సినిమాను నిలబెట్టాయి. అలా సినిమా కోసం కథ సిద్ధమైయ్యాక ఆర్టిస్టులను ఎంపిక చేయడానికి దాదాపు ఆరు నెలల సమయం తీసుకున్నారట వేణు యెల్దండి. సినిమాల్లో ఆల్రడీ నటిస్తున్న వాళ్ళు కొంతమందైతే సురభి కళాకారులు కొంతమందిని తీసుకున్నారట. నాటక రంగంలో ప్రవేశమున్న కళాకారులను చాలా మందిని తీసుకోవడం వల్ల అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికీ మంచి పాత్ర రావడం వల్ల ఆకలితో ఉన్న పులికి వేట దొరికినట్లు అయిందని సూపర్ గా యాక్ట్ చేసారని, వజ్రల్లాంటి ఆర్టిస్టులు దొరికారంటూ చెప్పారు వేణు.

సినిమా కథ దిల్ రాజు గారికి మూడు గంటలు చెప్పానని, సినిమా కథ ఓకే అయ్యాక సుమారు ఆరు నెలలు ఆర్టిస్టుల ఎంపిక జరగడంతో ప్రొడక్షన్ వాళ్ళు నన్ను తిట్టుకున్నారు. దిల్ రాజు ఇంతమంచి అవకాశం ఇస్తే వీడు ఇలా చేస్తున్నాడేంటి అనుకున్నారు. కానీ ఆర్టిస్టుల సెలక్షన్ అంతా అయ్యాక షూటింగ్ అపుడు అలా అనుకున్నవాళ్లే వచ్చి ప్రశంసించారు అంటూ చెప్పారు వేణు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago