Featured

Balagam fame Kota Jayaram : కుక్క కంటే హీనంగా చూసారు… జీవితంలో ఆ రోజును మర్చిపోలేను…: బలగం ఫేమ్ కోట జయరాం

Balagam Fame Kota Jayaram : తెలంగాణ పల్లె వాతావరణం, సంస్కృతిని సహజంగా చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ఒక మనిషి చనిపోయినపుడు ఇంట్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను చాలా సునిశితంగా చూపించారు. బలగం సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశ విదేశాలలో చాలా మందికి నచ్చుతోంది. ఇక తెలంగాణ పల్లెల్లో అయితే గ్రామంలో అందరూ కలిసి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా సినిమా అందరికీ కనెక్ట్ అయి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా అంతగా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమతో చాలా మంది ఆర్టిస్టులకు వచ్చింది. అలా సినిమాలో హీరోకి తండ్రి అయిలయ్యగా నటించిన కోట జయరాం గారు బాగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటు ఆయన కెరీర్ గురించి మాట్లాడారు.

కుక్క కంటే హీనమా…

సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఉన్న జయరాం గారు సినిమాల్లో కంటే సీరియల్స్ లో బాగా పేరు తెచ్చుకున్నారు. దాదాపుగా 40కి పైగా సీరియల్స్ లో నటించిన ఆయన ఎక్కువగా పోలీస్ పాత్రలలో నటించారట. ఇక ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది అనే విషయం గురించి మాట్లాడుతూ జయరాం గారి స్నేహితుడు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తికి మొదట ఈ క్యారెక్టర్ ఆఫర్ రాగా ఆయన చేయలేనని చెప్పడం అదే సమయంలో జయరాం గారు అక్కడ ఉండటంతో ఆడిషన్ అక్కడే చేసి వేణు మళ్ళీ మూడు నెలల తరువాత ఆ పాత్రకు జయరాం గారిని సెలెక్ట్ చేశారట. అలా బలగంలో అవకాశం వచ్చిందని తెలిపారు.

అయితే అంతకుముందు తన సినిమా జర్నీ గురించి చెబుతూ చిన్న వేషాలైనా పర్వాలేదు అని చాలా సినిమాల్లో చేసానని అయితే మొదట్లో ఒక సినిమా సమయంలో బాగా చేస్తున్నానని కెమెరా మెన్ నా మీద ఫోకస్ పెడదామంటే పక్కన కుక్క మీద పెట్టు అతని మీద ఎందుకు అంటూ అనేసరికి బాధేసింది, కుక్కకి ఉన్న వాల్యూ ఆర్టిస్ట్ కి లేదా అనిపించింది. అదే కో డైరెక్టర్ మళ్ళీ ఎపుడైనా కనిపిస్తే మాట్లాడుతాడు నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తావ్ అని చెప్తాడు అది అయన తప్పు కూడా కాదనిపిస్తుంది కానీ ఆ క్షణం బాధేసింది అంటూ చెప్పారు జయరాం.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago