Categories: FeaturedMovie News

Balagam fame Muralidhar : తెలంగాణ భాష నా బలం… నానా కుటుంబం గురించి…: బలగం ఫేమ్ మురళీధర్

Balagam fame Muralidhar : ఉద్యోగంలో రిటైర్డ్ అయ్యాక నటన మీద ఆసక్తితో సీరియల్స్ వైపు వెళ్లి అలా సినిమాల్లోనూ అవకాశాల కోసం తిరుగుతూ చిన్న చిన్న సినిమాల్లో చిన్న పాత్రలను కూడా చేసిన మురళీధర్ గారు ‘డిజే టిల్లు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కథనాయకుడు, మహానాయకుడు, వినవయ్య రామయ్య, పిట్ట కథలు వంటి సినిమాల్లో నటించినా మరింత మంచి పేరు నటనకు తెచ్చింది మాత్రం ‘బలగం’ సినిమానే. చిన్న సినిమాగా వచ్చిన బలగం సినిమా నేడు రెండు రాష్ట్రాలోనూ సంచలన విజయాన్ని నమోదు చేసింది. నగరాలు, గ్రామాలు అని తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తున్న సినిమా బలగం. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టుకీ మంచి పేరు అలాగే గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో నారాయణ పాత్రలో నటించిన మురళీధర్ గౌడ్ గారు సినిమా గురించి అందులో అవకాశం ఎలా వచ్చింది వంటి విషయాలను అలాగే తన కెరీర్ లో తాను పడిన ఇబ్బందులను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

తెలంగాణ భాష నాకు బలం…

మురళీధర్ గారు మొదట్లో సీరియల్స్ లో నటించారు. ఆ సమయంలోనే కొంతమంది స్నేహితులు నటన, గాత్రం, ఆహార్యం అన్నీ బాగున్నాయి సినిమాల్లో ప్రయత్నించు అని సలహాలు ఇచ్చారట. అలా సినిమాల్లో ప్రయత్నించినపుడు అవకాశాలు రాలేదట. కాకపోతే ఆయాచితంగా తాను ప్రయత్నించని సినిమా ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వచ్చాయంటూ చెప్పారు. పిట్ట కథలు సినిమాలో తరుణ్ భాస్కర్ గారు నా వాచకం, నటనకు తీసుకున్నారు.

అలా తెలంగాణ భాష నాకు ప్లస్ అయింది. 50% భాష వల్ల అయితే 50% నా నటనతో గుర్తింపు తెచ్చుకున్నాను అంటూ బలగంలో నారాయణగా నటించిన మురళీధర్ గారు పేర్కొన్నారు. అంతకుముందు డిజే టిల్లు లో హీరో తండ్రి పాత్రలో ఇమిడి పోయిన ఆయన ప్రస్తుతం బలగంలో నారాయణ గా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన వ్యక్తిగత విషయాలకి వస్తే ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు కాగా వాళ్ళు స్థిర పడి ముగ్గురు మనవళ్లు ఒక మనుమరాలితో చక్కని కుటుంబం ఉంది. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు అంటూ మురళీధర్ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago