Balagam Fame Sujatha : కమెడియన్ వేణు గారు డైరెక్టర్ గా మారి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని తీశారు. కమెడియన్ కాబట్టి కామెడీ సినిమా తీస్తారని అందరూ అనుకున్నా అందుకు భిన్నంగా ఒక ఎమోషనల్ డ్రామాను చావుతో ముడిపడిన బంధాలను చూపించి ఆకట్టుకున్నాడు. చిన్న సినిమాగా వచ్చిన బలగం సినిమా నేడు థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటోంది. అందులో నటించిన ఆర్టిస్టులందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుజాత సినిమా గురించి ప్రస్తుతం తనకు దక్కుతున్న ప్రశంసల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
పనిమనిషికి కూడా నీ ముఖం పనికిరాదన్నారు…
బలగం సినిమాలో మొగిలయ్య పెద్ధ కోడలిగా ఐలయ్య భార్యగా నటించిన సుజాత గారు ఆ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలో తన సహజమైన నటనతో ఆకట్టుకున్న ఆమె కో డైరెక్టర్ నాగరాజు గారి వల్ల సినిమా ఆడిషన్ కి వెళ్ళానని అక్కడ సెలెక్ట్ అవుతానని అనుకోలేదు. అంతకుముందు ఎన్నో సినిమా ఆడిషన్స్ కి వెళ్లినా ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వలేదని చెప్పారు.
కొన్ని సార్లైతే ఒక ఆమె నీ మొహం పనిమనిషి పాత్రకు కూడా సరిపోదు. అదికూడా సీరియల్స్ లో పనిమనిషి క్యారెక్టర్ కి కూడా పనికి రాదు అని అవమానించారంటూ ఇంటర్వ్యూలో చెప్పి ఎమోషనల్ అయ్యారు సుజాత. అలా అన్నపుడు బాగా ఏడ్చి భార్తతో చెబితే తానే ధైర్యం చెప్పేవాడని, చివరకు బలగం సినిమా నేడు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అంటూ, నాకూ ఒకరోజు వచ్చిందంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…