Categories: FeaturedMovie News

Balakrishna : అన్ స్టాపబుల్ షోలో మెగా, నందమూరి అభిమానులకు పండగ… ఒకే వేదికపై చిరు, బాలయ్య..!

Balakrishna : కుర్ర హీరోలకు మేం ఏమాత్రం తక్కువ కాదంటూ సినిమాలు తీస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య. ఇక బాలకృష్ణ లో కొత్తకోణం తెలిసింది మాత్రం ఆహా ఒరిజినల్స్ లో వచ్చిన అన్ స్టాపబుల్ షో ద్వారానే. బాలయ్య అల్లరి, సమయస్పూర్తి తో వచ్చిన గెస్ట్ ల నుండి కొత్త విషయాలను బయటికి రప్పించారు. బాలయ్య సినిమాలో మాస్ డైలాగు ఏ సెంటర్ అయిన నేను దిగనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా సినిమాలే కాకుండా ఓటీటీ లోకి దిగారో లేదో టీఆర్పి రేటింగ్స్ బద్ధలైపోయాయి.

బాలయ్య షోలో చిరు…

ఇక అన్ స్టాపబుల్ షో రేంజ్ ఎక్కడికి వెళ్లిందంటే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDB) రేటింగ్స్, ప్లస్ సర్వేలో 9.7 రేటింగ్ తో ఇండియా లో నెంబర్ వన్ గా నిలిచింది. అలాగే గ్లోబల్ టాప్ 50 లో 18వ స్థానంలో నిలబడి సత్తా చాటింది. ఇక ఆహా ఒరిజినల్స్ కి అంతమంది సబ్స్క్రయిబర్లు తక్కువ కాలంలో దొరకడానికి కారణం వన్ అండ్ ఓన్లీ బాలయ్య బాబే. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఆహా ఓనర్ అల్లు అరవింద్ చెప్పడం గమనార్హం.

ఇంతలా హిట్ అయిన ఈ షో రెండో సీజన్ ఎపుడు వస్తుందా అని అభిమానులు, కామన్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15 నుండి రెండో సీజన్ రాబోతున్నట్లు సమాచారం. ఇక ఇక్కడ మరో సర్‌ప్రైజ్ ఈ సీజన్ లో చిరంజీవి షోలో గెస్ట్ గా రాబోతున్నారు. షూటింగ్ కూడా పూర్తయిందనే టాక్ వినిపిస్తోంది ఇది కనుక నిజమైతే మెగా, నందమూరి అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న కోరిక తీరినట్లే. మరి ఈ ఇద్దరు లెజెండ్స్ షోలో ఎంత హంగామా చేస్తారో వేచి చూడాల్సిందే.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago