Balakrishna : కుర్ర హీరోలకు మేం ఏమాత్రం తక్కువ కాదంటూ సినిమాలు తీస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య. ఇక బాలకృష్ణ లో కొత్తకోణం తెలిసింది మాత్రం ఆహా ఒరిజినల్స్ లో వచ్చిన అన్ స్టాపబుల్ షో ద్వారానే. బాలయ్య అల్లరి, సమయస్పూర్తి తో వచ్చిన గెస్ట్ ల నుండి కొత్త విషయాలను బయటికి రప్పించారు. బాలయ్య సినిమాలో మాస్ డైలాగు ఏ సెంటర్ అయిన నేను దిగనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా సినిమాలే కాకుండా ఓటీటీ లోకి దిగారో లేదో టీఆర్పి రేటింగ్స్ బద్ధలైపోయాయి.

బాలయ్య షోలో చిరు…
ఇక అన్ స్టాపబుల్ షో రేంజ్ ఎక్కడికి వెళ్లిందంటే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDB) రేటింగ్స్, ప్లస్ సర్వేలో 9.7 రేటింగ్ తో ఇండియా లో నెంబర్ వన్ గా నిలిచింది. అలాగే గ్లోబల్ టాప్ 50 లో 18వ స్థానంలో నిలబడి సత్తా చాటింది. ఇక ఆహా ఒరిజినల్స్ కి అంతమంది సబ్స్క్రయిబర్లు తక్కువ కాలంలో దొరకడానికి కారణం వన్ అండ్ ఓన్లీ బాలయ్య బాబే. ఇక ఈ విషయాన్ని స్వయంగా ఆహా ఓనర్ అల్లు అరవింద్ చెప్పడం గమనార్హం.

ఇంతలా హిట్ అయిన ఈ షో రెండో సీజన్ ఎపుడు వస్తుందా అని అభిమానులు, కామన్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15 నుండి రెండో సీజన్ రాబోతున్నట్లు సమాచారం. ఇక ఇక్కడ మరో సర్‌ప్రైజ్ ఈ సీజన్ లో చిరంజీవి షోలో గెస్ట్ గా రాబోతున్నారు. షూటింగ్ కూడా పూర్తయిందనే టాక్ వినిపిస్తోంది ఇది కనుక నిజమైతే మెగా, నందమూరి అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న కోరిక తీరినట్లే. మరి ఈ ఇద్దరు లెజెండ్స్ షోలో ఎంత హంగామా చేస్తారో వేచి చూడాల్సిందే.



























