Balakrishna : నేడు ఎన్టీఆర్ జయంతి. తెలుగు సినిమా నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జయంతి ఉత్సవాలను ఘనంగా ఆయన అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు చేస్తున్నారు. ఇక ఈ సందర్బంగా ఆయన మనవళ్ళు, హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఆయన సమాధికి నివాళులు అర్పించారు. ఇక ఈ సందర్బంగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఇక సీనియర్ ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ తన తండ్రి శత జయంతి సందర్బంగా ఒక వీడియో విడుదల చేసారు. నందమూరి తారక రామారావు గారు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి బడుగు బలహీన వర్గాల మదిలో చిరస్తాయిగా నిలిచిపోయారు. ఇపుడు ఆయన తనయుడు బాలకృష్ణ హిందూపురం నుండి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఆయన శత జయంతి సందర్బంగా శక పురుషుడు నందమూరి తారకరామారావు గారి శత జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా జరుపుతామని ఈ కార్యక్రమాల్లో నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొంటారని వీడియో ద్వారా తెలిపారు.
ఇక హిందూపురం నియోజక వర్గంలో రెండు రూపాయలకే భోజనం పథకాన్ని ప్రారంభిస్తున్నారు. హిందూపురం మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అన్న గారు పార్టీ స్థాపించినప్పటి నుండి ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుండి గెలుపొందారు. ప్రస్తుతం బాలకృష్ణ రెండోసారి హిందూపురం నుండి శాసన సభకు ఎన్నికయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీ మహానాడును వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పార్టీ శ్రేణులంతా కలిసి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒంగోలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ వేడుకలను ప్రారంభించగా, ప్రకాశం జిల్లాలో శుక్ర, శనివారాల్లో మహానాడు జరుగుతోంది.
వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి కొంత మందగించడం సహజమనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే ఇటీవల వెలువడుతున్న పరిశోధనలు…
వేసవి కాలంలో మండే ఎండలు చర్మంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. బయటకు వెళ్లిన కొద్దిసేపటికే ముఖం మసకబారడం, చర్మం పొడిబారడం,…
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీవనశైలిపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, నిద్రలేమి,…
గుండె ఆరోగ్యం బాగోలేని సమయంలో శరీరం ముందుగానే కొన్ని హెచ్చరిక సంకేతాలను పంపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. చాలామంది ఛాతి నొప్పినే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజ పానీయాల వినియోగం కూడా ఎక్కువవుతోంది. ముఖ్యంగా బీట్‌రూట్ జ్యూస్‌ను చాలా మంది రోజువారీ…
చికెన్ వండే ముందు నీళ్లతో బాగా కడగడం చాలా ఇళ్లలో సాధారణ అలవాటే. మార్కెట్ నుంచి తెచ్చిన మాంసాన్ని పలుమార్లు…