Balakrishna : నందమూరి నటసింహం బాలయ్య అటు పౌరణికాలు, జానపద, సాంఘిక ఇలా అన్నిరకాల చిత్రాలలో నటించి మెప్పించారు. తండ్రి లాగే తన వాక్ పటిమతో, అభినయంతో అలరించారు. ఆరు పదుల వయసులో కూడా కుర్రహీరోలతో సమానంగా హిట్లు కొడుతూ గట్టి పోటీ ఇస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తరువాత మళ్ళీ థియేటర్లకు పండగ తెచ్చాడు అఖండ సినిమాతో. అభిమానులకు మరోసారి జాతర చేయించాడు. అఖండ సినిమాలో మురళి కృష్ణ పాత్రలో ఎంత బాగా నటించాడో, అఖండ పాత్రలోనూ అంతే ఒదిగిపోయాడు. ఇక ఆహా ఒరిజినల్స్ ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షో ద్వారా బాలయ్య అంటే ఏంటో చూపించాడు. కేవలం అభిమానులకే కాదు, కామన్ ఆడియన్స్ ని కూడా తన ఎనర్జెటిక్ పెర్ఫార్మన్స్ తో మెప్పించాడు. నిజానికి ఆహా కు సబ్ స్క్రైబర్లు పెరిగారంటే దానికి బాలకృష్ణనే కారణం.

నెగెటివ్ పాత్రలో మెప్పించాలని ఉందట……
ఇక బాలయ్యబాబు అటు క్లాస్ పాత్రాల్లోను మెప్పించాడు, ఇక మాస్ ఫ్యాక్షన్ సినిమాలంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్సే. ఇప్పటివరకు రకరకాల పాత్రల్లో నటించిన తేడా సింగ్ కి ఒక్క కోరిక మాత్రం తీరలేదట. అదే పూర్తి స్థాయిలో విలన్ గా నటించాలనే కోరిక. ఇప్పటికీ చాలా మంది దర్శకులకు ఆఫర్ కూడా ఇచ్చారట. ఒక పవర్ ఫుల్ విలన్ పాత్రను తనకోసం రూపొందించమని అడిగాడట. ఇక ఇతర హీరోలతో కలిసి మల్టీ స్టార్రర్ కి కూడా సిద్ధమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట కానీ ఇంతవరకు బాలకృష్ణ కోరిక మాత్రం తీరలేదు. సుల్తాన్ వంటి సినిమాల్లో నెగెటివ్ షేడ్ పాత్రలో నటించినా పూర్తి స్థాయిలో ఇంతవరకు నటించలేదు. ప్రస్తుతం కుర్ర దర్శకులతో సినిమాలు చేస్తున్న బాలయ్య తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వములో ఒక సినిమా చేస్తున్నారు. నేడు బాలయ్య పుట్టినరోజు సందర్బంగా ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఇక బాలయ్య పవర్ యాక్షన్ డైలాగులు అభిమానులను ఫిదా చేసాయి. ఇక సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్ తో చెప్పేసాడు గోపీచంద్. ఇక ఈసినిమాలో బాలయ్య కి జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. బాలయ్య బ్లాక్ షర్ట్ వైట్ గడ్డం లుక్ అయితే అదుర్స్ అనేలా ఉంది. బోయపాటి తరువాత బాలయ్యను ఇంత పవర్ ఫుల్ గా గ్లామరస్ గా చూపింది గోపీచంద్ అనే చెప్పాలి. విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్న బాలయ్యను విలన్ గా ఏ దర్శకుడు చూపిస్తాడో బాలయ్య కోరికను తీరుస్తాడో చూడాలి.




























