Categories: FeaturedMovie News

60 వస్తున్నా 20లా ఫీలవుతున్న బాలయ్య !!

నందమూరి నటవారసుడు తొలిసారిగా సెంచరీ దాటేశారు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా.? మీరు చదివింది నిజమే.. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న సినిమా 106వ సినిమాకోసమే ఇప్పుడు మీరు చదవబోతున్నారు.

టాలీవుడ్ లో ఇప్పటి వరకూ 100 సినిమాలు పూర్తి చేసిన స్టార్ హీరోల్లో లెజెండ్ బాలకృష్ణ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఒక నట వారసుడు 100 సినిమాలు పూర్తిచేయడం ప్రపంచ సినీ చరిత్రలోనే లేదట. అయితే, నందమూరి బాలకృష్ణ ఈ ఘనతను సాధించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ.. నటుడిగా తానేంటో నిరూపించుకుని నందమూరి వారసత్వాన్ని కొనసాగించారు. కోట్లాది మంది అభిమానుల హృదయాలలో సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకున్నారు.

ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. వాస్తవానికి తాను ఇప్పటికి రెండొందలకు పైనే సినిమాలు చేయాల్సిందని.. కానీ చదువు కారణంగా చేయలేకపోయానని చెప్పుకొచ్చారు. తన తండ్రి ఎన్టీఆర్ తనను ‘వీడే నా వారసుడు’ అని అంటుండేవారని, ఇంటర్ పూర్తిచేసిన తరవాత ఏం చేయాలనుకుంటున్నావు అని బాలయ్యను ఎన్టీఆర్ అడిగారట. కానీ, బాలకృష్ణ నుంచి సమాధానం లేదు. మెడిసిన్ ఎంట్రన్స్ రాశావా అనడిగారట. బాలకృష్ణ తనకు ఇంట్రస్ట్ లేదని చెప్పారట. దాంతో చివరి క్షణంలో తనతో దరఖాస్తు రాయించి మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్ష రాయించారని బాలయ్య తెలిపారు.

మొదటి నుంచీ చదువు మీద తనకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, అందుకే మెడిసిన్ ఎంట్రన్స్ లో ర్యాంక్ రాలేదని, ఆ తర్వాత బాలకృష్ణ డిగ్రీలో చేరారట. అలా డిగ్రీ చదవడానికి మూడు సంవత్సరాలు సమయం కేటాయించి వుండకపోయుంటే ఇప్పటికి 250 సినిమాలు పూర్తయ్యేవని బాలయ్య అన్నారు. ఇదిలా వుండగా జూన్ 10నాటికి బాలకృష్ణకి 60 ఏళ్ళొస్తున్నాయి. ఇదే విషయాన్ని బాలయ్య ప్రస్తావిస్తూ.. తనకు 60 ఏళ్లు వచ్చినట్టు లేదని, మళ్లీ 20ఏళ్ల వయసులోకి వెళ్లినట్టు ఉందని అన్నారు. మరి మన లెజెండ్ బాలయ్య బాబు తన సినీ కెరీర్లో సూపర్ స్టార్ కృష్ణలాగ 300కు పైగా సినిమాలలో నటించాలని కోరుకుందాం.????????????

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago