నందమూరి నటవారసుడు తొలిసారిగా సెంచరీ దాటేశారు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా.? మీరు చదివింది నిజమే.. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న సినిమా 106వ సినిమాకోసమే ఇప్పుడు మీరు చదవబోతున్నారు.

టాలీవుడ్ లో ఇప్పటి వరకూ 100 సినిమాలు పూర్తి చేసిన స్టార్ హీరోల్లో లెజెండ్ బాలకృష్ణ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో ఒక నట వారసుడు 100 సినిమాలు పూర్తిచేయడం ప్రపంచ సినీ చరిత్రలోనే లేదట. అయితే, నందమూరి బాలకృష్ణ ఈ ఘనతను సాధించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ.. నటుడిగా తానేంటో నిరూపించుకుని నందమూరి వారసత్వాన్ని కొనసాగించారు. కోట్లాది మంది అభిమానుల హృదయాలలో సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకున్నారు.

ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. వాస్తవానికి తాను ఇప్పటికి రెండొందలకు పైనే సినిమాలు చేయాల్సిందని.. కానీ చదువు కారణంగా చేయలేకపోయానని చెప్పుకొచ్చారు. తన తండ్రి ఎన్టీఆర్ తనను ‘వీడే నా వారసుడు’ అని అంటుండేవారని, ఇంటర్ పూర్తిచేసిన తరవాత ఏం చేయాలనుకుంటున్నావు అని బాలయ్యను ఎన్టీఆర్ అడిగారట. కానీ, బాలకృష్ణ నుంచి సమాధానం లేదు. మెడిసిన్ ఎంట్రన్స్ రాశావా అనడిగారట. బాలకృష్ణ తనకు ఇంట్రస్ట్ లేదని చెప్పారట. దాంతో చివరి క్షణంలో తనతో దరఖాస్తు రాయించి మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్ష రాయించారని బాలయ్య తెలిపారు.

మొదటి నుంచీ చదువు మీద తనకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, అందుకే మెడిసిన్ ఎంట్రన్స్ లో ర్యాంక్ రాలేదని, ఆ తర్వాత బాలకృష్ణ డిగ్రీలో చేరారట. అలా డిగ్రీ చదవడానికి మూడు సంవత్సరాలు సమయం కేటాయించి వుండకపోయుంటే ఇప్పటికి 250 సినిమాలు పూర్తయ్యేవని బాలయ్య అన్నారు. ఇదిలా వుండగా జూన్ 10నాటికి బాలకృష్ణకి 60 ఏళ్ళొస్తున్నాయి. ఇదే విషయాన్ని బాలయ్య ప్రస్తావిస్తూ.. తనకు 60 ఏళ్లు వచ్చినట్టు లేదని, మళ్లీ 20ఏళ్ల వయసులోకి వెళ్లినట్టు ఉందని అన్నారు. మరి మన లెజెండ్ బాలయ్య బాబు తన సినీ కెరీర్లో సూపర్ స్టార్ కృష్ణలాగ 300కు పైగా సినిమాలలో నటించాలని కోరుకుందాం.????????????



























