‘ఏక్షణమైనా చెలియా నీ జ్ణాపకం..” ఈ పాట వినగానే టాలీవుడ్ ప్రేక్షకుల మదిలో మెరిసే రూపం నటి కౌసల్య. నువ్వే నా ప్రేయసి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్న ఈ అందాల భామ మీకు గుర్తుందా.?
ఏంటీ ఇంకా గుర్తుకు రాలేదా.?! అదేనండీ జగపతి బాబు హీరోగా నటించిన “అల్లుడుగారు వచ్చారు” చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన కౌసల్య కోసమే ఇప్పుడు మీరు చదవబోతున్నారు. మన టాలీవుడ్ హీరో శ్రీకాంత్ సరసన ఈమె నటించిన “పంచదార చిలక” చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడమే గాకుండా నటి కౌసల్యకు మంచి గుర్తింపును కూడా తెచ్చి పెట్టింది. నటి కౌసల్య తమిళం, మరియు తెలుగు చిత్రాలలో నటించినా వాస్తవానికి ఆమె కన్నడ నటి అన్న విషయం చాలా మందికి తెలియదు. తన అందం, అభినయం, నటనతో బాగానే ఆకట్టుకున్న నటి కౌసల్య కి ప్రస్తుతం 40 సంవత్సరాలు వచ్చాయి.
దీంతో ఈ అందాల తార పెళ్లి గురించి సోషల్ మీడియాలో కొన్ని గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. మలయాళ చిత్రసీమకు చెందిన ఓ స్టార్ హీరోతో ఈ అమ్మడు అప్పట్లో ప్రేమాయణం నడిపిందని, ఆ హీరో మాత్రం ఓ బడా వ్యాపారవేత్త కూతురిని పెళ్లి చేసుకున్నాడని దాంతో కొంతకాలం పాటు నటి కౌసల్య తీవ్ర మనస్థాపానికి గురై సినీరంగానికి దూరమైందని మీడియా టాక్. డిప్రెషన్ నుండి కోలుకొని మళ్లీ ఇటీవలే సినిమాల్లో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. టాలీవుడ్ లో ఈమధ్యనే అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా నటించిన “రారండోయ్ వేడుక చూద్దాం”, “సవ్యసాచి” తదితర చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.
తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ అందాల నటి మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం భాషలలో కలిపి ఇప్పటి వరకూ 30కి పైగా చిత్రాల్లో నటించింది. మరి పంచదార చిలక లాంటి ఈ నటి జీవితం మరెన్ని మలుపులు తిరగబోతుందో కాలానికే తెలియాలి. ????????????
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…