హైదరాబాద్: ఓటీటీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన వెబ్ సిరీస్‌లలో ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ప్రాణాలను పణంగా పెట్టి ఆడే ఈ సర్వైవల్ గేమ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై రికార్డు వ్యూస్ అందుకుంది. మూడు సీజన్‌లు వచ్చి, అన్నీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి.

కృత్రిమ మేధస్సు (AI) అందుబాటులోకి వచ్చాక, ఈ వెబ్ సిరీస్‌లో భారతీయ సెలబ్రిటీలు పాల్గొంటే ఎలా ఉంటుందో ఊహిస్తూ నెటిజన్లు అనేక వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా, నటుడు నందమూరి బాలకృష్ణ, రాజీవ్ కనకాల, యాంకర్ అనసూయ ఈ గేమ్‌లో పాల్గొన్నట్లు ఒక వీడియో వైరల్‌గా మారింది.
బాలయ్య మార్క్ యాక్షన్
ఎప్పుడూ సినిమాలలో చనిపోయే పాత్రలలో కనిపించే రాజీవ్ కనకాల ఈ AI వీడియోలో కూడా చనిపోగా, బాలయ్య తన ఆవేశంతో ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేయడు. దీంతో రైడర్స్ అతడిని తీసుకుని వెళుతుండగా, ‘అఖండ 2’ టీజర్‌లో శూలం తిప్పినట్లు ఇందులో తిప్పి శత్రువులందరినీ చితకబాదుతాడు. బాలకృష్ణ మార్క్ యాక్షన్, ఆయన పవర్‌ఫుల్ డైలాగులతో కూడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— Out of Context Telugu (@OutOfContextTel) July 17, 2025






























