Movie News

బ్రేకింగ్: ప్రమాదానికి గురైన బాలకృష్ణ… అయినా లెక్కచేయకుండా..

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా షూటింగులో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.ఈ క్రమంలోనే బాలక్రిష్ణ తర్వాత సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నారు.

ఈ గ్యాప్ లోనే బాలయ్య బాబు ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఓటీటీ లో ఆహా యాప్ ద్వారా ఒక టాక్ షో చేయబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ జరుపుతున్న సమయంలో బాలయ్య బాబుకు స్వల్ప ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది.ఈ ప్రమాదంలో బాలక్రిష్ణ కాలికి గాయం అయినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా షూటింగ్ వాయిదా వేయకుండా షూటింగ్లో పాల్గొన్నారు.

మొదట బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారన్న వార్త తెలియడంతో ఆందోళన చెందిన అభిమానులు ఆయన తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారని తెలియగానే అతనికి పెద్ద ప్రమాదం జరిగి ఉండకపోవచ్చుని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా హీరోలు వరుసగా ప్రమాదాలకు గురవడంతో అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

గతనెల సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ఇప్పటివరకు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇకపోతే మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన సిద్ధార్థ ఏకంగా స్పైనల్ సర్జరీ చేయించుకున్నారు. ఇక లింగుస్వామి దర్శకత్వంలో హీరో రామ్ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా రామ్ కూడా ప్రమాదానికి గురికావడంతో అభిమానులు ఆందోళనల చెందుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago