Balakrishna Movies: వెండితెరకు నందమూరి వారసుడుగా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటిస్తూ అగ్ర హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటిస్తూ నటుడిగా గుర్తింపు పొందడమే కాకుండా రాజకీయాలలోకి కూడా వచ్చి రాజకీయ నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు.
బాలకృష్ణ ఇలా రాజకీయాలలో సినిమా ఇండస్ట్రీలోని ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ ఆయన కుటుంబం మాత్రం ఏనాడు ఈయన పలుకు బడిని ఎక్కడ ఉపయోగించలేదని చెప్పాలి.
బాలకృష్ణ వ్యక్తిగత జీవితం వేరు రాజకీయ సినీ జీవితం వేరని చెప్పాలి. ఈ రెండింటిని ఆయన ఎప్పుడు ముడిపెట్టి చూడరు. ఇకపోతే బాలకృష్ణ సుమారు 100కు పైగా సినిమాలలో నటించినప్పటికీ ఆయన నటించిన సినిమాలలో తన భార్య వసుంధరకు ఒకే ఒక సినిమా నచ్చిందని తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు.
వసుంధరకు బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా చాలా బాగా నచ్చిందనే విషయాన్ని డైరెక్టర్ వివి వినాయక్ తో చెప్పినట్టు ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ ఇంట్లో కూడా ఎంతో చలాకిగా ఉంటూ రోజు షూటింగ్లో జరిగిన సన్నివేశాలన్నీ తనతో చెప్పే వారట. ఈ విషయాన్ని వసుంధర గారు తనతో ఎన్నోసార్లు చెప్పారని వినాయక్ వెల్లడించారు.ఇక ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన బాలకృష్ణ లుక్ తనకి ఎంతగానో నచ్చిందని బాలకృష్ణ గారిని చాలా అద్భుతంగా చూపించారంటూ ఆరోజు వసుంధర గారు కాంప్లిమెంట్ ఇచ్చారని వినాయక్ వెల్లడించారు.
ఈ విధంగా వసుంధర తన భర్త బాలకృష్ణ నటించిన అన్ని సినిమాలలో కెల్లా తనకు చెన్నకేశవరెడ్డి సినిమా నచ్చిందని చెప్పడం అందులో తండ్రి పాత్రలో ఆయన ఎంతో అద్భుతంగా ఉన్నారని ప్రశంసించడం తాను ఎప్పటికీ మర్చిపోలేనని వినాయక్ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం బాలకృష్ణ భార్య వసుంధర గురించి వివి వినాయక్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…