Mahanati Movie: తెలుగు తెరపై ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహానటి సావిత్రి గురించి ఈ తరం వారికి కూడా తెలిసింది.ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. సినిమాలలో కోట్లు సంపాదించిన దానధర్మాల పేరిట ఆస్తులను దానం చేసి చివరికి ఒంటరిగా తనువు చాలించారు.
ఈమె ఇండస్ట్రీలో నటిగా ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. అయితే ఈమెకు మహానటి అనే పేరు వచ్చినప్పటికీ ఆ పేరు వెనుక ఆ విజయం వెనుక ఎంతో కష్టం కన్నీళ్లు దాగి ఉన్నాయని చెప్పాలి. ఇలాంటి ఒక అద్భుతమైన నటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నిర్మాత అశ్విని దత్ తన బ్యానర్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
మహానటి పేరుతో కీర్తి సురేష్ సావిత్రి బయోపిక్ చిత్రం చేశారు. అయితే ముందుగా ఈ సినిమాలో కీర్తి సురేష్ కి బదులు నిత్యమీనన్ పేరు వినిపించింది. సావిత్రి బయోపిక్ చిత్రంలో నిత్యామీనన్ నటించబోతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.అయితే కొన్ని కారణాల వల్ల నిత్యామీనన్ రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం కీర్తి సురేష్ అందుకున్నారు. ఇందులో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించడం అనేకన్నా జీవించారని చెప్పాలి.
తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాలో కీర్తి సురేష్ ని తీసుకోవడానికి గల కారణం తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎక్కడ నిత్యమీనన్ పేరు ప్రస్తావించకపోయిన ఈ సినిమాని ఒక మలయాళీ హీరోయిన్ రిజెక్ట్ చేశారని తెలిపారు. ఆమె అలా రిజెక్ట్ చేయడానికి కారణాన్ని కూడా అశ్వినీ దత్ వెల్లడించారు.ఈ సినిమాలో తాను మద్యం ముట్టుకోనని తాగే సన్నివేశాలు ఉంటే నటించనని చెప్పడంతో నిర్మాత ఏకంగా హీరోయిన్ ని మార్చేశారు. అలా ఈ సినిమాలో నిత్యమీనన్ అవకాశం కోల్పోయి కీర్తి సురేష్ అందుకున్నారు. అయితే ఈయన ఎక్కడ నిత్యామీనన్ పేరు ప్రస్తావించలేదు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…