Movie News

Rakesh Master: జబర్దస్త్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రాకేష్ మాస్టర్… అక్కడ ఫుడ్ మరి దారుణం !

Rakesh Master: గత కొంతకాలం నుంచి జబర్దస్త్ కార్యక్రమ నిర్వాహకులు పలు వివాదాలను విమర్శలను ఎదుర్కొంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అందుకు గల కారణం ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎలాంటి దుమారం రేపాయో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్పీ జబర్దస్త్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా కోట్లు సంపాదిస్తున్న మల్లెమాలవారు కనీసం ఆర్టిస్టులకు ఫుడ్డు కూడా సరిగా పెట్టరంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.

అదేవిధంగా ఆపదలో ఉన్న కానీ ఎవరికీ శ్యాం ప్రసాద్ రెడ్డి సహాయం చేయరంటూ ఈయన చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈయన వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ ఆర్పీ చేసిన వ్యాఖ్యలలో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. అయితే జబర్దస్త్ కార్యక్రమంలో కొద్ది రోజుల పాటు ప్రేక్షకులను సందడి చేసిన రాకేష్ మాస్టర్ ఈ విషయంపై స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన జబర్దస్త్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కార్యక్రమం గురించి చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు పాలు కరెక్టేనని ఈయన వెల్లడించారు. జబర్దస్త్ కార్యక్రమంలో ఫుడ్ ఏ మాత్రం బాగుండదని ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్ ఫుడ్ విషయం గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Rakesh Master: బయట ఫుడ్డు తెప్పించుకొని తింటున్నారు…

తాను జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్నప్పుడు బుల్లెట్ భాస్కర్ స్కిట్లో చేశాను అయితే బుల్లెట్ భాస్కర్ ఉన్నన్ని రోజులు నాకు ఫుడ్డు గురించి ఏ విధమైనటువంటి బాధ లేదు అయితే ఒక రోజు ఆయన లేకపోవడంతో తాను కూడా అందరిలాగే వెళ్లి క్యూలో నిలబడ్డానని కానీ అక్కడ ఫుడ్ ఏ మాత్రం బాగాలేదని అని తెలిపారు. బుల్లెట్ భాస్కర్ ఉన్నన్ని రోజులు తనకు బయట నుంచి ఫుడ్ తెప్పించి పెట్టారని ఇప్పటికి కొందరు అలాగే బయట నుంచి ఫుడ్ తెప్పించుకుంటున్నారు అంటూ రాకేష్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago