Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.
ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.
బోయపాటి పైనే భారం..
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…