Categories: FeaturedMovie News

Magadheera: చరణ్ అభిమానులకు శుభవార్త.. థియేటర్లో రిలీజ్ కాబోతున్న.. ఎప్పుడో తెలుసా?

Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచింది.

రీ రిలీజ్‌..

దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్‌ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్‌ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌ బాబు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago