Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
రీ రిలీజ్..
దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్ బాబు.


































