Movie News

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాకముందే ప్రభాస్ బాలీవుడ్ సినిమాలో నటించారని తెలుసా?

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రభాస్ (Prabhas) ఒకరు. ఈయన కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ అనంతరం ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి (Bahubali) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ రావడంతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే బాహుబలి సినిమా ద్వారా మాత్రమే ప్రభాస్ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లారని మనం భావిస్తాము కానీ ఈయన పాన్ ఇండియా స్టార్ హీరో కాకముందే బాలీవుడ్ సినిమాలలో నటించారు.

ఇలా ప్రభాస్ బాలీవుడ్ సినిమాలో నటించారు అనే విషయం చాలా మందికి తెలియదు అయితే ఈయన హీరోగా కాకుండా ఒక హీరో సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించే సందడి చేశారట అది కూడా కేవలం కొన్ని సెకండ్ల పాటు ప్రభాస్ ఆ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో ప్రభాస్ నటించిన బాలీవుడ్ సినిమా ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు ప్రభాస్ ఫ్యాన్స్.

బాహుబలి కంటే ముందే ప్రభాస్ బాలీవుడ్ మూవీ యాక్షన్ జాక్సన్ (Action Jackson) సినిమాలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. ఇలా కొన్ని సెకండ్ల పాటు గెస్ట్ పాత్రలో కనిపించి సందడి చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ నటించిన విషయం కూడా చాలామందికి తెలియదు. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొంది వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈయన కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భాషలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా మే తొమ్మిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అదే సమయంలోనే ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో ఈ సినిమా విడుదలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమా విడుదల వాయిదా గురించి మేకర్స్ ఏ విధమైనటువంటి ప్రకటన తెలియజేయలేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago