Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రభాస్ (Prabhas) ఒకరు. ఈయన కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ అనంతరం ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి (Bahubali) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ రావడంతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే బాహుబలి సినిమా ద్వారా మాత్రమే ప్రభాస్ బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లారని మనం భావిస్తాము కానీ ఈయన పాన్ ఇండియా స్టార్ హీరో కాకముందే బాలీవుడ్ సినిమాలలో నటించారు.
ఇలా ప్రభాస్ బాలీవుడ్ సినిమాలో నటించారు అనే విషయం చాలా మందికి తెలియదు అయితే ఈయన హీరోగా కాకుండా ఒక హీరో సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించే సందడి చేశారట అది కూడా కేవలం కొన్ని సెకండ్ల పాటు ప్రభాస్ ఆ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో ప్రభాస్ నటించిన బాలీవుడ్ సినిమా ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు ప్రభాస్ ఫ్యాన్స్.
బాహుబలి కంటే ముందే ప్రభాస్ బాలీవుడ్ మూవీ యాక్షన్ జాక్సన్ (Action Jackson) సినిమాలో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. ఇలా కొన్ని సెకండ్ల పాటు గెస్ట్ పాత్రలో కనిపించి సందడి చేశారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ నటించిన విషయం కూడా చాలామందికి తెలియదు. ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొంది వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈయన కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక భాషలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా మే తొమ్మిదవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అదే సమయంలోనే ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో ఈ సినిమా విడుదలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమా విడుదల వాయిదా గురించి మేకర్స్ ఏ విధమైనటువంటి ప్రకటన తెలియజేయలేదు.
































