కొన్ని కాంబినేషన్ గురించి చెప్పు ఉంటారు.కొన్ని కాంబినేషన్స్ చరిత్ర సృష్టిస్తాయి. మరి కొన్ని కాంబినేషన్స్ ఆ చరిత్రనే తిరగరాస్తాయి. సరిగ్గా అలాంటిదే బాలయ్యబాబు, బి.గోపాల్ కాంబినేషన్.
అసిస్టెంట్ డైరెక్టర్ గా అనేక చిత్రాలకు పనిచేసిన బి.గోపాల్, సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన “ప్రతిధ్వని” చిత్రంతో దర్శకునిగా బి.గోపాల్ కు అవకాశం కల్పించారు. మొదటి సినిమా విజయవంతం అవడంతో అవకాశాలు బి.గోపాల్ ని వెతుక్కుంటూ వచ్చాయి.
ఆ తర్వాత నాగార్జున, వెంకటేష్, చిరంజీవిలాంటి హీరోలతో సినిమాలు రూపొందించి, 1990 బాలకృష్ణ, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా “లారీడ్రైవర్” చిత్రాన్ని రూపొందించారు. పరుచూరి బ్రదర్స్ కథతో లారీ డ్రైవర్ చిత్రాన్ని రూపొందించి బి.గోపాల్ హిట్ కొట్టారు, చక్రవర్తి సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.
1992 త్రివిక్రమరావు నిర్మాణం, బి.గోపాల్ దర్శకత్వంలో ‘రౌడీ ఇన్స్పెక్టర్’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. పుష్పానంద్ తయారు చేసిన కథతో పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించారు. ఒక సన్నివేశంలో.. హీరో బాలకృష్ణ పోలీస్ పాత్రలో.. యూనిఫామ్ తీసేస్తే నీకంటే పెద్ద రౌడీనిరా అంటూ ఆయన చెప్పే సంభాషణలు ప్రేక్షకుల చేత ఈలలు కొట్టించాయి.
1999 చెంగల వెంకట్రావు నిర్మాణం, బి.గోపాల్ దర్శకత్వంలో సమరసింహారెడ్డి చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో బాలకృష్ణ, సిమ్రాన్ అంజలా జావేరి, సంఘవి హీరో హీరోయిన్లుగా నటించారు. 6 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒకే థియేటర్లో 365 రోజులు నడిచి 1999 సంవత్సరానికి గాను ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఆ తర్వాత బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్ లో 2001 ఎమ్.వి.మురళీకృష్ణ నిర్మాణం, బి.గోపాల్ దర్శకత్వంలో ‘నరసింహనాయుడు’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో బాలకృష్ణ, సిమ్రాన్, ప్రీతి జింగానియా, ఆశాషైనీ హీరో, హీరోయిన్లుగా నటించారు. పరుచూరి బ్రదర్స్ అందించిన అద్భుతమైన కథతో బి.గోపాల్ ఈ చిత్రాన్ని రూపొందించారు. 105 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని ఫ్యాక్షన్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ గా మారింది.
2003 వెంకటరమణ ప్రొడక్షన్స్, బి.గోపాల్ దర్శకత్వంలో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో బాలకృష్ణ, సోనాలి బింద్రే, ఆర్తిఅగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించారు. పోసాని కృష్ణమురళి ఈ సినిమాకి కథ అందించగా.. పరుచూరి సోదరులు సంభాషణలు రాశారు. బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన 4చిత్రాలు బాక్సాఫీసు వద్ద విజయ దుందుభి మోగించగా ఐదవ చిత్రం ‘పలనాటి బ్రహ్మనాయుడు’ బాక్సాఫీస్ వద్ద ఒక ఫ్లాప్ గా మిగిలిపోయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…