Featured

Balayya : బాలకృష్ణను ఆయన అభిమానులు ముద్దుగా “బాలయ్య” అని పిలుస్తుంటారు. నిజంగా ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.?!

Balayya : నందమూరి బాలకృష్ణ ను ఫ్యాన్స్ చాలా పేర్లతో పిలుస్తుంటారనే విషయం తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.. ఇతడిని అభిమానుల ముద్దుగా నటసింహం అని.. బాలయ్య బాబు అని.. యువరత్న అని.. గోల్డెన్ స్టార్ అని.. ఇలా అనేక పేర్లతో పిలుచుకుంటారు అనే విషయం విదితమే.. కానీ నందమూరి అభిమానులతో పాటు మాములు తెలుగు ప్రేక్షకులు సైతం ఈయనను ఎక్కువుగా జై బాలయ్య అనే పేరుతోనే పిలుస్తారు. కానీ మీకు తెలుసా జై బాలయ్య అనే స్లోగన్ ఎలా వచ్చింది.. ఎప్పటి నుండో బాలయ్యను అలా పిలుస్తున్నారో.. జై బాలయ్య అనే స్లోగన్ మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినా పేరు..

ఇటీవలే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాలో ఏకంగా జై బాలయ్య అనే సాంగ్ కూడా పెట్టారు.. ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సాంగ్ థియేటర్ లో వస్తుంటే నందమూరి అభిమానులు పూనకాలతో ఊగిపోయారు.. ఇంతకు ముందు కంటే ఈ సాంగ్ వచ్చిన తర్వాత జై బాలయ్య అనే స్లోగన్ మరింత పవర్ ఫుల్ గా వినిపిస్తుంది. ఇక ఇప్పుడు బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు కూడా “జై బాలయ్య” అనే టైటిల్ అనుకుంటున్నట్టు టాక్ నడుస్తుంది.

అసలు బాలయ్య అనే స్లోగన్ ఎలా వచ్చిందో మీకు తెలుసా.. డైరెక్టర్ బి గోపాల్, బాలకృష్ణ కాంబో అంటే తిరుగులేనిది.. వీరిద్దరి కాంబోలో దాదాపు ఐదు సినిమాలు చేస్తే అందులో నాలుగు సూపర్ హిట్ అవ్వగా,.. ఒకటి మాత్రమే ప్లాప్ అయ్యింది. అందులో ఒక సినిమా లారీ డ్రైవర్.. ఈ సినిమా చేసేటప్పుడు బి గోపాల్ రచయితతో మీరు ఏమైనా రాసుకోండి కానీ పాటలో బాలయ్య అని మాత్రం వినిపించాలి అని చెప్పాడట.
రచయిత జొన్నవిత్తుల ఆయన విన్నపాన్ని విని అలాగే సాంగ్ లో బాలయ్య అని వచ్చే విధంగా “బాలయ్య.. బాలయ్య.. గుండెల్లో గోలయ్య.. జోకొట్టాలయ్యా”.. అనే పాట రాసారు.

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి అందించిన స్వరాలు లారీ డ్రైవర్ చిత్రాన్ని విజయవంతం చేశాయి. ఈ సినిమా వచ్చి మూడు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికి బాలకృష్ణను బాలయ్య అని ముద్దుగా పిలుచుకోవడం అలవాటు అయ్యింది. ఇలా బాలయ్య కాస్త జై బాలయ్య అయ్యి ఇప్పుడు ఇదే పేరుతొ పిలుచుకోవడం అలవాటు అయ్యింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago