Categories: FeaturedMovie News

Srinivasulu : విజయ నిర్మల మెడ లోని వజ్రాల హారం ఏమైంది? నరేష్ స్నేహితుడు, నటుడు శ్రీనివాసులు సంచలన వాఖ్యలు…!

Srinivasulu : నరేష్, పవిత్ర లోకేష్ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ కన్నడ మీడియా ముందుకు వెళ్లి నానా రచ్చ చేసింది నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి. ఇక పవిత్ర లోకేష్ మీద ఒక ప్రముఖ ఛానెల్ ద్వారా స్ట్రింగ్ ఆపరేషన్ చేయించింది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే స్ట్రింగ్ ఆపరేషన్ లో పవిత్ర లోకేష్ నరేష్ తో కలిసి కృష్ణ గారి ఇంట్లో ఉంటున్నట్లు సహజీవనం చేస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. మళ్ళీ మైసూర్ హోటల్ గదిలో ఇద్దరూ ఉండటం అక్కడకు వెళ్లి రమ్య రఘుపతి పోలీసులు, మీడియాను వెంటేసుకుని వెళ్లి రచ్చ చేసింది. ఇక వీటిపై నరేష్ స్నేహితుడు సీనియర్ నటుడు శ్రీనివాసులు మాట్లాడారు.

విజయ నిర్మల గారి వజ్రాల హారం ఏమైంది…

ఇక శ్రీనివాసులు గారు నరేష్ గారికి చాలా ఏళ్ల నుండి స్నేహితులు, మా అసోసియేషన్ లో పనిచేస్తున్నప్పటి నుండి ఆయనతో సాన్నిహిత్యం పెరిగిందని చెప్పారు. ఇక రమ్య రఘుపతిని చాలా తక్కువ సార్లు చూసానని విజయ నిర్మల గారు చనిపోయినపుడు చూసానని చెప్పారు. నరేష్ తో చాలా ఏళ్ల నుండి స్నేహం ఉన్నా ఆయన పడుతున్న మానసిక క్షోభ తెలియదని, మీడియా ముందు బెంగళూరు లో మాట్లాడినప్పుడే ఆయన చెబుతుంటే అర్థమైందని అన్నారు శ్రీనివాసులు. మొదటి భార్య ఆవిడే విడాకులు తీసుకున్నారు, రెండో భార్య తల్లి నుండి నరేష్ ను వేరు చేయాలని చూడడంతో విడిపోయారు.

ఇక మూడో భార్య కు చాలా ఏళ్లుగా దూరంగా ఉంటున్నా, విజయనిర్మల గారు చిన్న బాబు ఉన్నాడు అప్పుడే విడాకులు ఏంటి అనడంతో విడాకులకు పోకుండా విడిగా దూరంగా ఉన్నారు అంటూ ఇవన్నీ నరేష్ గారే రమ్య మీడియా ఇష్యూ అయ్యాక చెప్పారని అంతవరకు ఈ విషయాలేవి తెలియవని చెప్పారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించకుండా ఆమె కన్నడ మీడియా ముందుకు వెళ్లడం బాగోలేదని అభిప్రాయ పడ్డారు. ఇక విజయనిర్మల గారి వజ్రాల హారం ఏమైంది అనే ప్రశ్నకు శ్రీనివాసులు గారు అంత వ్యక్తిగత విషయాలు నాకు తెలియవు. నరేష్ గారి ఆస్తులు వంటి విషయాల్లో బయటి వాళ్లకు ఎందుకు, ఈ ఇష్యూ మీడియా ముందుకు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం లేకపోతే అసలు మనం ఎందుకు వారి వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి అంటూ ఆ విషయం గురించి స్పందించలేదు. విషయాన్ని పెద్దల ముందు సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago