Featured

Lohith Kumar : జగన్ ను ఇమిటేట్ చేయలేను… అగ్నిపథ్ నచ్చక పోతే ట్రైన్ తగులబెట్టాలా అంతా విపరీత ధోరణి : లోహిత్ కుమార్

Lohith Kumar : తెలుగులో మిమిక్రి ఆర్టిస్ట్ గా అటు సినిమాల్లోను ఇటు బుల్లి తెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి లోహిత్ కుమార్ రెడ్డి. కమెడియన్ వేణు మాధవ్ గారి చొరవతో మిమిక్రి ఆర్టిస్ట్ గా పట్టాభి గారి దగ్గర చేరిన లోహిత్ గారు ఆతరువాత బాపు వంటి పెద్ద డైరెక్టర్ కు అసోసియేట్ గా చేరారు ఇక ఆ తరువాత బాపు గారు తీసిన శ్రీ నాథ కవి సార్వభౌమ కథ సినిమాలో అవకాశం ఇచ్చిన వివిధ కారణాలతో చేయలేదు. ఇక మళ్ళీ ఆయన దర్శకత్వంలోనే బుడుగు సీరియల్ లో హీరోగా చేసారు. ఇక ఆశల పల్లకి అనే సినిమాలో హీరోగా చేసిన లోహిత్ గారు ఆ సినిమాలకు నంది అవార్డులు కూడా వచ్చాయి.

ఇప్పటి రాజకీయ నాయకులను అనుకరించలేను….

ఇక ఎంతో మందిని మిమిక్రి ద్వారా అనుకరించే లోహిత్ గారికి కమల్ హాసన్ ను అనుకరించడం చాలా ఇష్టమట. ఇక లోహిత్ గారి పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది వివిధ శబ్దాలను ప్రతి ఐదు సెకండ్లకు మారుస్తూ ఎక్కువ సమయం చేశారట. ఇక రాజకీయ నాయకులను అనుకరించే లోహిత్ గారు ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న జగన్ ను అనుకరిస్తారా? అని అడుగగా ఇప్పటి రాజకీయనాయకులు అనుకరణను ఎంటర్టైన్మెంట్ లా చూడటం లేదు సీరియస్ గా తీసుకుంటున్నారు.

సీనియర్ రాజకీయ నాయకులు వారిపై వేసిన జోకులను పట్టించుకునే వారు కాదు లైట్ తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు రాజకీయనాయకులు ప్రతిదీ చాలా సీరియస్ గా తీసుకుంటారు. అందుకే అనుకరించడం లేదంటూ చెప్పారు. ఇక ఏ రాజకీయనాయకుడు దగ్గర మాట్లాడిన సమాజ సేవ గురించే మాట్లాడుతా అంటూ చెప్పిన లోహిత్ గారు రీసెంట్ గా జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన గురించి మాట్లాడారు. ఇప్పటి యువత అన్నింటికీ విపరీత ధోరణితో ఆలోచిస్తోంది. పబ్ లకు పార్టీలకు వెళ్లొద్దని చెప్పడం లేదు. కానీ ఒక విషయంలో నచ్చక పోతే చెప్పే ధోరణి బాగోలేదు. మొన్న జరిగిన సికింద్రాబాద్ ఘటనలో అగ్నిపథ్ పథకంలో మీకు నచ్చని అంశాలు ఉంటే చెప్పే విధానం వేరే ఉంటుంది దానికి రైలు తగులబెట్టడం సరైన పని కాదు ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చింది.

అదంతా టాక్సుల రూపం లో మనమే కడుతున్నామనే విషయాన్నీ మర్చిపోతున్నారు పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రాల్లో ఉన్న టాక్సుల గురించి చూడండి. ప్రతిదీ ఫ్రీగా వస్తే చాలు అంటూ సంక్షేమ పథకాలకు అలవాటు పడితే ఇంకో పదేళ్లకు నెత్తి మీద పిడుగు పడిన సరేలే ఎవరన్నా వస్తారు అనేంత సోమరిగా తయారవుతాము అంటూ నేటి పరిస్థితుల గురించి మాట్లాడారు.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago