Bangarraju: అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బంగార్రాజు..కానీ మరో బ్యాడ్ న్యూస్ ఎంటంటే..!
Bangarraju: అటు బిగ్ బాస్ సీజన్ 5కి హోస్ట్ గా ఉటూ.. ఇటు సోగ్గాడే చిన్ని నాయనకు ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమాలో నటించాడు. ఇందులో నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా.. జనవరి 14న థియేట్రికల్‌గా విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడటంతో సంక్రాతి బరిలో నిలిచే సినిమాలకు బాగా కలిసిరానుంది. అందులో ఈ సినిమా కూడా కావడం విశేషం.
ఇదంతా ఇలా ఉంటే.. ఈ బంగార్రాజు సినిమా ఫైనల్ కాపీ ఇంకా సిద్ధం కాలేదని వార్తలు వస్తున్నాయి. ఇది అభిమానులను కాస్త నిరాశే అని చెప్పాలి. దీనికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా సాగుతున్నాయి. నాగార్జున కూడా అదే పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కంటెంట్ పై బంగార్రాజు పూర్తి నమ్మకంగా ఉన్నట్లు సమాచారం.
తన యాజమాన్యంలోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీఎఫ్‌ఎక్స్, సౌండ్ మిక్సింగ్ పనులను వ్యక్తిగతంగా నాగార్జున పర్యవేక్షిస్తున్నాడు. నాగార్జున దగ్గర నుంచి డైరెక్ట్ ఆర్డర్‌లతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌లోని టెక్నీషియన్లు కూడా బంగార్రాజుపై పూర్తిగా దృష్టి పెట్టారు. మూవీ చిత్ర యూనిట్ అంతా.. చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బంగార్రాజు ఇప్పటి వరకు నాగార్జున కెరీర్‌లో అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.25కోట్లు దాటినట్లు తెలుస్తోంది. కేవలం ఏపీలోని సీడెడ్ ప్రాంతంలోనే రూ.12 కోట్ల రేషియో వచ్చినట్లు సమాచారం. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం 2016లో వచ్చిన సాగ్గాడే చిన్నినాయనకు ప్రీక్వెల్ అన్న విషయం తెలిసిందే. ఇక దీనికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని వహిస్తుండగా.. విడుదలైన అన్నీ పాటలు బంబర్ హిట్ కొట్టాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…